కేసీఆర్ ఒకటి అనుకుంటే ఒకటి అయ్యింది కేసీఆర్ జాతకాలు బాగా నమ్ముతాడని మనకందరికీ తెలిసిందే. నవంబరులోగా ఎన్నికలు జరిగితే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తాడని ఆయనకు జోస్యులు చెప్పారని, అందుకే ఆలోగా ఎన్నికలు వచ్చేసేలాగా.. కేసీఆర్ హడావిడిగా సెప్టెంబరు 6వ తేదీన శాసనసభను రద్దుచేసేశారని కూడా ఇన్నాళ్లూ ప్రత్యర్థులు ఆరోపిస్తూ వచ్చారు. తీరా చూడబోతే ఇప్పుడు ఎన్నికలు డిసెంబరు నెలలోకి వెళ్లిపోయాయి.

Image result for kcr

మరి ఇది కేసీఆర్ కోరుకున్న ముహూర్తం కాదని, ఎన్నికల సంఘం నిర్ణయం ఆయనకు కంటగింపు అని కూడా ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీలను గమనిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా బలంగా నమ్మే ముహూర్తాలకు దెబ్బ పడిపోయినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ జాతకాలు, ముహూర్తాలు తిథి వార నక్షత్ర కరణ యోగాలను చాలా బలంగా నమ్ముతారని అంతా అంటుంటారు. ఏ పని చేయాలన్నా, ఏ పనికి బయల్దేరాలన్నా ఇంట్లో పద్ధతిగా పురోహితులతో పూజాదికాలు నిర్వహించిన తర్వాత గానీ కదలరని కూడా అంటుంటారు.

Image result for kcr

ఆ విషయం నిజమేనేమో అనిపించే దృష్టాంతాలు కూడా ఉన్నాయి. ఈ తిథి వార నక్షత్రాల పరగా అన్నీ సరిచూసుకుని శ్రావణ మాసం కృష్ణ ఏకాదశి గురువారం నాడు కేసీఆర్ శాసనసభను రద్దుచేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారని కూడా పలువురు అంటుంటారు. అయితే చూడబోతే ఇప్పుడు ఈసీ ప్రకటించిన తేదీలు అంత సుముహూర్తాల్లో లేవు.


మరింత సమాచారం తెలుసుకోండి: