వైసీపీ అధినేత జగన్ మడమ తిప్పను, మాట తప్పను అని తరచూ చెబుతూ ఉంటారు. మరి ఆయన పదేళ్ళ రాజకీయ జీవితంలో మొండిగానే వెళ్ళిన దాఖలాలు చాలానే  ఉన్నాయి. జనాలను సైతం అవి ఆకట్టుకున్నాయి.  నిజానికి జగన్ లో బలమే మొండితనం, అదే బలహీనత కూడా. అలా మొండిగా తీసుకున్న ఓ డిసిషన్ ఆయన్ని కొన్నాళ్ళుగా ఇబ్బంది పెడుతోంది. ఇపుడు అది మరో మారు రచ్చ అయ్యేలా ఉంది.


హోదా  పేటెంట్ :


ప్రత్యేక హోదాపై పేటెంట్ హక్కులు వైసీపీకి దఖలు పడేలా జగన్ నాలుగేళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చారు. ఆయన ఎక్కడా తగ్గకుందా ఉద్యమాలు, ఆందోళనలతో హోదాని సజీవంగా ఉంచగలిగారు. దానికి క్లైమాక్స్ అన్నట్లుగా తన పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయించారు. అయితే ఇక్కడే సరిగ్గా టైమింగ్ తప్పారని కామెంట్స్ వచ్చాయి. 


బీజేపీతో లింక్ :


రాజీనామాలు వైసీపీ ఎంపీలు ఏప్రిల్ నెలలో చేశారు. అంటే అప్పటికి ఇంకా లోక్ సభ కాల పరిమితి ఏడాది పైగానే ఉంది. మరి వాటిని స్పీకర్ ఆమోదించేసరికి జూన్ 3 అయింది. దాంతో ఉప ఎన్నికలు రాలేదు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీగా చెప్పేసింది. మరి రాజీనామాలు చేసినపుడున్న  దూకుడు ఆమోదించుకోవడంలో వైసీపీ చూపించలేదా. రెండు నెలలు అలా రాజీనామలు పడి వుండడం వల్ల క్లైమాక్స్ పోరాటం తుస్సుమందా. ఇది కావాలని జరిగిందా, మరేదైనానా అన్న డౌట్స్ ఇపుడు పుట్టుకొస్తున్నాయి.


టీడీపీకి ఆయుధం :


కేంద్ర ఎన్నికల సంఘం మాటలు ఇపుడు టీడీపీకి కొత్త ఆయుధాన్ని ఇచ్చాయి. కేంద్రంలో మోడీతో వైసీపీ కలసిపోయిందని మళ్ళీ రచ్చకు అనుకూల మీడియాతో పాటు టీడీపీ రెడీ అయిపోయింది. దీనిపై అపుడే జూనియర్ బాబు టిట్టర్ లో ట్వీటేశారు కూడా. ఇలా ప్రత్యేక హోదా ఉధ్యమాన్ని పీక్ స్టేజ్ లోకి తీసుకెళ్ళిన వైసీపీ ఆఖరి పోరాటంలో తడబడడం వల్ల పేటెంట్ హక్కులను కోల్పోవడమే కాదు. మరో వైపు రాజకీయంగా అభాసుపాలైంది. మరిపుడు దీని నుంచి బయట పడేందుకు ఆ పార్టీ వద్ద ఉన్న కొత్త అస్త్రాలేంటి అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: