ఏపీలో రాజకీయాలను మార్చే జిల్లా అది. చెప్పాలంటే అక్కడ ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారే సీఎం కుర్చీ ఎక్కుతారు. ఉమ్మడి ఏపీలోనూ ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయింది. విభజన తరువాత కూడా తొలి ఎన్నికలో అదే ప్రూవ్ అయింది. అంతటి ప్రాముఖ్యత కలిగిన జిల్లా ఏపీలోని తూర్పు గోదావరి. దీనికి మరో పేరు రాజకీయ ఛైతన్యం. ఇక్కడ ఓటు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలి.


సీన్ మారుతుందా :


ఎక్కడ సర్వేలు ఫెయిల్ అయితే కావచ్చు కానీ తూర్పు గోదావరి సర్వేలు మాత్రం పర్ఫెక్ట్. దానికి కారణం ఇక్కడ ప్రజలది  ఓపెన్ మైండ్. వారు మనసులో ఏదీ దాచుకోరు. ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పేస్తారు. అందువల్ల ఈ జిల్లాలో సర్వే అంటే పక్కా అని నమ్ముతారు. పోయిన ఎన్నికల్లో టీడీపీ కొమ్ము కాసిన ఈ జిల్లా బాబుకు సీఎం కుర్చీ అప్పగించింది. మరి ఈమారు మార్పు తెస్తుందా అన్నది చూడాలి.


గురి పెట్టారా :


జనసేనాని పవన్ కళ్యాన్ తూర్పు గోదావరి పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ మొత్తం 21 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో మెజారిటీ పట్టుకెల్తే చాలు రేపటి రాజకీయంలో కింగ్ మేకర్ అయిపోవచ్చు. ఇపుడు ఇదే ఆలొచనలో పవన్ ఉన్నారట. తూర్పు గోదావని మనకు బలమైన జిల్లా, ఎట్టి పరిస్తిల్లో అక్కడ జనసేన జెండా ఎగరాలి. ఇదీ పవన్ నినాదం. ప్రజలు జనసేన వైపే ఉన్నారు. సీట్లు తగ్గినా ఓటమి పాలు అయినా అది పార్టీ తప్పే కానీ జనానిది కానే కాదని పవన్ అంటున్నారు. అంటే అంత నమ్మకం ఈ జిల్లాపై పవన్ పెట్టుకున్నారని అర్ధమవుతోంది.


అందుకే ఆ ధీమా :


ఇదే జిల్లాలో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఉన్నారు. ఆయన గడచిన మూడేళ్ళుగా పోరాటం చేస్తున్నారు. కాపులను బీసీల్లో కలపాలని గొంతెత్తి నినదిస్తున్నారు. ఆయన ఇపుడు తీసుకోబోయే నిర్ణయం ఏ పార్టీకైనా వరమో, శాపమో అవుతుంది. టీడీపీని, వైసీపీని వ్యతిరేకిస్తున్న ముద్రగడ జనసేన వైపు మొగ్గు చూపుతారని అంతా భావిస్తున్నారు. ఈ ధీమవే పవన్ తో మాట్లాడిస్తోంది. మొత్తం సీట్లు ఇక్కద మనవేనని పవన్ నిబ్బరంగా చెబుతున్నారు. మరి ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా. తూర్పు తో జనసేన జాతకం మారుతుందా. వైట్ అండ్ సీ..


మరింత సమాచారం తెలుసుకోండి: