ఓటుకు నోటు కేసు ఇప్పటిది కాదు మూడేళ్ళ క్రితం లాంటిది కానీ ఇప్పటివరకు ఆ కేసు ఏమైందో ఎందుకు ఆగిపోయిందో సామాన్య ప్రజలకు ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే మరలా ఇప్పడూ ఆ కేసులో కొంచెం కదలిక వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్‌ ఎమ్మెల్యేని ఐదుకోట్లకు కొనుగోలు చేసి టీఆర్‌ఎస్‌ను ఓడించి, ఆ తర్వాత ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నది వ్యూహమని కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. చంద్రబాబు తన మామ ఎన్‌టీఆర్‌ను గద్దెదించిన అనుభవంతో కేసీఆర్‌పై కూడా ప్రయోగం చేయబోయారు కాని భంగపడ్డారు.

Image result for chandrababu naidu and kcr

కేసులో ఇరుక్కున్నారు. కాని ఆ తర్వాత కేసును మేనేజ్‌ చేయడంలో మాత్రం సఫలం అయ్యారు. కేంద్రంలోని మోడీ సాయం చేశారా? లేక వెంకయ్యనాయుడు ఉపయోగపడ్డారా? లేక  కేసీఆర్‌ను ఏమైనా భయపెట్టారా? ఏమైందో తెలియదు కాని కేసీఆర్‌, చంద్రబాబులు రాజీపడ్డారన్నది అభిప్రాయం.  ప్రజాస్వామ్యాన్నే డబ్బుతో కొనుగోలు చేయాలని జరిగిన ఇలాంటి వాటిని చూస్తూ వదలివేయడం ప్రభుత్వ వ్యవస్థల తప్పుకాదా? ఇప్పటికైనా మనదేశంలో ప్రజాస్వామ్యం సజావుగా సాగాలంటే, కుట్రలకు కళ్లెం వేయాలంటే, ఓటుకు నోటు కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నది నిర్ధారించవలసిన అవసరం ఉంది.

Image result for chandrababu naidu and kcr

రేవంత్‌ ఏవో ఆరోపణలు చేశారనో, చంద్రబాబుకు ఇబ్బంది అవుతుందనో, లేక ఈ కేసులతో ఎవరికో సానుభూతి వస్తుందనో అనుకుని అసలు కేసులను వదలివేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడమే అవుతుంది. ఈడీకాని, ఆధాయపన్ను శాఖ కాని ఇప్పుడు కేసుపై యాక్టివ్‌ అవడం తప్పుకాదు.. ఇంతవరకు అచేతనంగా పడి ఉండడం తప్పు అనిచెప్పాలి. అయితే వర్తమాన రాజకీయాలలో ఈ కేసు నిజంగానే లాజికల్‌ ఎండ్‌కు వెళుతుందా, చంద్రబాబుకు ఉన్న పరపతి దానిని ముందుకు సాగనిస్తుందా అన్నది ఇంకా సందేహమే.

మరింత సమాచారం తెలుసుకోండి: