పవన్ కళ్యాణ్ మైకు పట్టుకుంటే చాలు రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని తీసుకొస్తామని చెబుతుంటాడు అయితే తెలంగాణ లో ఎన్నికల కు డేట్స్ కు ఫిక్స్ అయిపోయాయి అయితే ఇంత వరకు పవన్ పార్టీ చేస్తుందో లేదో తెలియడం లేదు. పవన్‌ కళ్యాణ్‌ ప్రతి విషయంలోనూ జాప్యం చేసినట్లే ఎన్నికల్లో పోటీచేసే విషయంలోనూ జాప్యంచేశాడు. ఎన్నికల తేదీ ప్రకటించాక తన పార్టీ పోటీ చేస్తుందని చెబుతూనే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నాడు. ఇంత అస్పష్టంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడో తెలియదు. ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం ఉన్నట్లయితే చాలా ముందుగానే అందుకు నిర్ణయం తీసుకోవల్సింది. గతంలో పవన్‌పై సీపీఎం చాలా ఆశలు పెట్టుకుంది. కాని పవన్‌ నుంచి స్పందనలేదు. అసలు తెలంగాణలో జనసేన పార్టీ ఉందో లేదో ఎవ్వరికీ తెలియదు.


పవన్ కు ఇప్పుడు అస్సలు విషయం అర్ధం అయ్యింది...!

నామమాత్రంగా పోటీచేసి పరువు పోగొట్టుకోవడంకంటే అసలు పోటీ చేయకపోవడం మంచిదేమో. తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసి రిస్క్‌ తీసుకోవడం ఎందుకనుకున్న వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ గమ్మునుండిపోయారు. ప్రస్తుతం తన దృష్టంతా ఏపీ మీదనే ఉందని పవన్‌ చెప్పాడు. అక్కడ మొత్తం 175 స్థానాల్లోనూ జనసేన  పోటీ చేస్తుందని, అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరో ఆరునెలల్లో అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పూర్తిగా ఏపీ మీద దృష్టిపెట్టడం మంచిదే.


పవన్ కు ఇప్పుడు అస్సలు విషయం అర్ధం అయ్యింది...!

అలాంటప్పుడు తెలంగాణలో నామమాత్రపు పోటీ అనవసరం. పోటీ చేసినంతమాత్రాన టీఆర్‌ఎస్‌కు నష్టం ఏమీ ఉండదు. ఆయన పవన్‌ పార్టీని పెద్దగా పట్టించుకోకపోవచ్చు కూడా. మరి పవన్‌ కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడా? లేదా చంద్రబాబు మాదిరిగా తెరవెనక ఉండి మంత్రాంగం చేస్తాడా? గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీని రెండుభుజాల మీద మోసుకుతిరిగిన ఈ అజ్ఞాతవాసి, ఆ సమయంలో కేసీఆర్‌ను, ఆయన సంతానాన్ని నానా తిట్లుతిట్టాడు. ఆవేశంతో ఊగిపోయాడు. వారూ అంతకు రెట్టింపుగా చెలరేగిపోయారు. రాష్ట్ర విభజన తరువాత కథ ముగిసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: