నరేంద్ర మోడీ ఎన్నికల సమయం లో అదును చూసి దెబ్బ కొట్టాడు ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ నాయకుల మీద ఐటీ సోదాలు ను తేలికగా కొట్టి పారవేయలేము బీజేపీ ప్లాన్ వేరే అని చెప్ప్పవచ్చు. బీహార్ లో కూడా లాలూ ను జైలుకు పంపించి బీహార్ ను తన ఆధీనం లో కి తెచ్చుకున్నాడు. ఇదే పద్దతిని బాబు మీద మోడీ ప్రయోగించ బోతున్నాడని చెప్పవచ్చు. అయితే ఈ దాడులను ఎల్లో మీడియా కొంచెం ఎక్కువ చేసి చూపిస్తుంది. 

Image result for chandrababu naidu and modi

అయితే ఆ దాడులను గురించి జగన్ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసినాడు. ఏపీలో జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు ఎందుకు గింజుకుంటాన్నారో చెప్పాలన్నారు వైసీపీ అధినేత జగన్. ఎక్కడో తీగ లాగితే.. తన ఇంట్లో డొంక కదులుతుందని భయపడుతున్నారని విమర్శించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో జరిగిన ప్రజా సంకల్పయాత్ర బహిరంగ సభలో ఐటీ దాడులపై జగన్ స్పందించారు.

Image result for jagan

ఎవరిపైనో ఐటీ దాడులు జరిగితే.. చంద్రబాబుకు భయమెందుకని ప్రశ్నించారు జగన్. ఐటీ అధికారులు తనిఖీలు చేస్తుంటే.. అదేదో కేంద్రం రాష్ట్రంపై యుద్ధం చేసినట్లు చిత్రీకరిస్తున్నారన్నారు. గతంలో ఐటీ సోదాలు జరిగినప్పుడు స్పందించని బాబు.. ఇప్పడెందుకు గింజుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుకు దోపిడి చేసిన డబ్బు బయటికొస్తుందేమోనని భయపడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి రూ.30కోట్లు తరలించారని విమర్శించారు ప్రతిపక్షనేత. ఆ వివరాలు బయటపడితే.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రశ్నిస్తారనే భయం పట్టుకుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు 23మందిని సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని.. ఆ డబ్బు ఎలా వచ్చిందో ఐటీ అధికారులు అడుగుతారనే ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: