తెలుగు రాష్ట్రాల్లో మీడియా చాలా కాలంగా మారిపోయింది. న్యాయమూర్తిగా వ్యవహ‌రించాల్సిన  మీడియా కులం కంపు కొడుతోంది. తమ వాడు అనుకుంటే తప్పు అయినా ఒప్పుగా చూపించేస్తోంది. పరవాడు అంటే ఇంక పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి ఉన్నవీ లేనివీ కూడా అల్లి మరీ కధలు వండి వార్చేస్తోంది. జనానికి కూడా ఈ విషయాలు తెలుసు. అయినా జమానా వారిది, అలా  సాగిపోతోంది.


తానా తందానా :


బాబు ఎలా అంటే అలా తానా తందానాగా ఎల్లో మీడియా ఏపీలో తయారైందని వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ఇదివరకు విలెకరుల సమావేశాల్లో మాత్రమే పచ్చ మీడియాపై వ్యంగ్యాస్త్రాలు సంధించే జగన్ ఇలా డైరెక్ట్ గా  జనంలోకి వచ్చి తిట్టడం మాత్రం ఇదే మొదలు అని చెప్పుకోవాలి. మరి ఎన్నికల వేడి అలాంటిది మరి. ఏకంగా ఓ మీడియా రాసిన వార్తలను జనాలకు చూపుతూ మరీ జగన్ వారి ఏవగింపు చేష్టలను ఎండగట్టేశారు.


ఉన్నది లేనట్లుగా:


పచ్చ మీడియా ఏపీలో జనం కళ్ళకు గంతలు కట్టలనుకుంటోంది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపడం బాబు మీడియాకే సాధ్యమని జగన్ ఎద్దేవా చేశారు. బాబు వైసీపీ ఎమ్మెల్యేలను 23 మందిని కొనుగోలు చేసినా తప్పు అనిపించదు, ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతున్నా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా వెనుకాడదీ ఎల్లో మీడియా.  ఆయన బీజేపీకి జై అంటే జై.. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు జై అంటే జై అని రాస్తుంది. అలా రాయడమే కాదు.. ఏమాత్రం మొహమాటం లేకుండా ఇతరుల మీద బురదజల్లుతుంది అంటూ విజయనగరం జిల్లా గుర్ల సభలో ఏకిపారేశారు.


దోపిడీని అభివ్రుధ్ధిగా :


చంద్రబాబు లక్షల కోట్లు దోపిడీ చేస్తే.. దాన్ని మనమంతా అభివృద్ధి అనుకోవాలని ఈ ఎల్లోమీడియా కోరుకుంటోంది. పోలవరం కమీషన్ల కోసం చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టినా, ఆయన ఢిల్లీలో చక్రం తిప్పాడని మనం అనుకోవాలని ఈ మీడియా కోరుతోంది. ఎంతకు మీడియా తెగించింది అంటే ఇటీవల ఓ సర్వేలో ఏపీలో పాతిక ఎంపీ సీట్లకు 21 సేట్లు వైసీపీకి వస్తాయని రాస్తే దానికి ఎక్కడా చూపించకుందా బాబు బాకా ఊదుతోందని జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


తీరు మారదుగా :


జగన్ ఇలా గొంతు ఎంత చించుకున్నా ఏపీ మీడీయా తీరు మారదుగా.  ఒక సామాజికవర్గం ఆధిపత్యంలో పడి మీడియా ఇక్కడ దూకుడు గా ఉంది. మీడియా ముసుగులో రాజకీయాలు సాగిపోతౌన్నాయి. మీడియా అధిపతులే డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి  ఎంటరవుతున్నారు. ఈ నేపధ్యంలో జగన్ లాటి వాళ్ళు ఎంతలా అరచి గీ పెట్టినా మీడియా మారదు కద మరింతా రెచ్చిపోతుంది. బాబు కు నచ్చని అన్న నందమూరినే విలన్ గా చూపించిన చాకచక్యం ఈ మీడియాది. అందువల్లా మీడియా గాడి తప్పిదన్న సంగతి ఆ మాత్రం ఈ మాత్రం ఆలోచించే జనాలందరికీ ఎరుకే. ఇది ఇక్కడితో ఆగేది కాదు, పోయేది అంతకంటే కాదు.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: