రాజకీయలేంటన్నది క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్స‌రాల నాడే చాణక్యుడు చెప్పాడు. కత్తికి కరుణ ఉండదు, మానవీయత అసలే ఉండదు, దాని పని ఖండించడమే. రాజకీయం కూడా అంతే. అందులోకి దిగాక నాలుగు అనాలి, నలభై పడాలి. ఇపుడున్న రాజకీయం మరీ దారుణంగా ఉంది. మరి ఇవన్నీ చూసిన తరువాత మంచి వారు రాజకీయాల్లోకి రావడానికి జంకుతున్నారు.


అపుడే వైరాగ్యమా :


పవన్ కళ్యాన్ మేధావిగానే చెప్పాలి. ఆయన్ని రాజకీయ నాయకుడి కంటే ఇలాగే చూడాలి. ఆయనకు సరిపడని వ్యవహారం వర్తమాన రాజకీయం. పవన్ నిక్కచ్చి మనిషి, ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెబుతూఅరు. ఆవేశపరుడు, మంచి చేద్దామన్న తపన ఉన్న వాడు. కానీ ఈ బురద రాజకీయం ఆయన్ని ఏమీ చేయనివ్వదు, ఇది పవన్ ని బాగా విసిగించేస్తోందనిపిస్తోంది. తాను మాత్రమే ఓ ప్రత్యేకం, పార్టీలో చేరిన వారితో స‌హ అంతా ఈ రాజకీయాలకు అలవాటు పడ్డవారే. అందుకే పవన్ లో చెప్పలేని విసుగు, బాధా మాటల్లో దొర్లుతున్నాయి.


పదవులు ముఖ్యం కదా :


రాజకీయాల్లోకి వచ్చాక పదవులు ముఖ్యమే. అధికారమే పరమావధి, అది వద్దు అనుకున్నపుడు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. రాజకీయం అంటే విజయమో, వీర స్వర్గమో అన్నట్లు ఉండాలి. పవన్ మాత్రం తనకు పదవులు ముఖ్యం కాదని తరచూ అంటూంటారు. దీని వల్ల క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బ తింటుంది. రాజకీయాల్లో అధికారమే అన్నీ అన్నట్లుగా ఇపుడు తయారైంది. పవన్ చెబుతున్నట్లు సేవాభావం అన్నది మచ్చుకైనా కానరావడమేలేదు.


ఆ తానులో ముక్కలే :


పవన్ పార్టీలో ఉన్నవారు, చేరుతున్న వారు ఈ రాజకీయం అనే తానులో ముక్కలే. అక్కడ పదవి రాక పోతే ఇక్కడ చేరారు, ఇక్కడ రాదనుకుంటే మరో గూటికి వెళ్ళిపోతారు. అలాంటి వారు పవన్ సూక్తులు ఎంతవరకూ వింటారు, పాటిస్తారు. పవన్ ఇపుడు చేర్చుకుంటున్న వారంతా వేరే పార్టీలో నలిగిన వారే. వారికి కొత్త రాజకీయం చేయమంటే సాధ్యమేనా.


వాళ్ళు మారరు :


పవన్ మంచి మాటలు కొన్ని చెప్పారు. రాజకీయల్లో తనకు శత్రువులు ఎవరూ లేరని. నిజమే. ఆయన చెప్పింది కరెక్ట్. సిధ్ధాంత విభేదాలు ఉండొచ్చు కానీ ఇక్కడ శత్రువులు ఉండరు, కానీ తెలుగు రాజకీయాల తీరు దారుణంగా తయారైపోయింది. శత్రువు కంటే  ఘోరంగా తిట్టుకుంటున్నారు. కనీసం పెళ్ళి, చావుల వంటి వాటికి సైతం పట్టించుకోవడం లేదు. రాజకీయంగా ఓటమి కాదు. అసలు పార్టీలే ఉండకూదదు అన్న తీరున దిగజారిన రాజకీయం చేస్తున్నారు.
ఇటువంటి వ్యవస్థలో పవన్ చెప్పే సుద్దులు ఎంతమంది పాటిస్తున్నారు. పవన్ వరకు అనుసరించినా అయన్ని కూడా ముగ్గులోకి లాగేస్తారుగా. అందుకే జనసేనానికి విసుగు వస్తోంది, అవే మాటలుగా బయటకు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: