మనిషి బతికుంటే విలువ అన్నది సామాన్యుని విషయంలో. అసామాన్యుడు చనిపోయాకే ఎక్కువ విలువ. ఇక రాజకీయ నాయకుడు బతికున్నప్పటి కంటే మరణించాక ఇంకా ఎక్కువ గౌరవం పొందుతాడు. సెంటిమెంట్లు, పధ్ధలకు పెట్టింది పేరైన భారతీయ రాజకీయాల్లో ఇది బాగా ఎక్కువగా రుజువవుతూ వచ్చిన వాస్తవం.


పెద్దాయన విషయంలో :


ఈ మధ్యన బీజేపీకి భీష్మాచార్యునిగా ఉన్న వాజ్ పేయి మరణించారు. ఆయనకు కడు ఘనంగా నివాళులు అర్పించిన తీరును దేశం యావత్తూ చూసింది. అదే వాజ్ పేయి ప్రధాని వున్న టైంలో అనారోగ్యం సాకు చూపించి ఆయన్న్ పదవి నుంచి దించేసేందుకు వరిష్ట నేతలు ట్రై చేశారన్నది కధనాలుగా చెప్పుకునేవారు. ఆయన ఇక మనకు పోటీ కాదు అన్న తరువాతే గౌరవాలు మర్యాదలు పెరుగుతాయన్నమాట.


ఎక్కువైపోతున్నాయి :


అలాగే ఈ మధ్యన  అన్న గారి మూడవ కుమారుడు హరిక్రిష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు. తెలంగాణా సర్కార్ అపుడు చేసిన హడావుడి చాలా ఎక్కువ. ఏకంగా కేసీయార్ నివాళి అర్పించడమే కాకుండా ప్రభుత్వ లాంచనాలతో అంత్య్రక్రియలు, స్మారక మందిరానికి స్థలం వంటివి మంజూర్ చేసేసారు. ఇక ఏపీ సర్కార్ కూడా రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.  ఇది తీవ్ర విమర్శలపాలైంది.


వరసగా అలాగే :


ఆ తరువాత సెప్టెంబర్లో  అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను మావోయిస్టులు దారుణంగా చంపేశారు. వారి విషయంలో కూడా ప్రభుత్వ లాంచనాలతో అంత్య క్రియలు, రెండు రోజుల పాటు సంతాప దినాలు ఏపీ సర్కార్ ప్రకటించింది. లేటెస్ట్ గా టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయనకూ ప్రభుత్వ లాంచనాలతో అంత్య క్రియలు, రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు.


నివాళి అంటే :


ఇది బాగానే ఉంది. కానీ ప్రభుత్వ లాంచనాలతో అంత్య క్రియలకు కొన్ని విధానాలు ఉన్నాయి. మంత్రి గా పనిచేసిన వారు, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వారు ఇలా నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే సంతాప దినాలు కూడా విధి విధానాలు ఉన్నాయి. ఇక్కడ చనిపోయిన వారంతా పెద్దలు, మహనీయులే, వారి గురించి కాదు కానీ పాలకుల రాజకీయ విధానాల గురించి చర్చించుకుంటే చేస్తున్నది ఏంటని ప్రశ్న వస్తుంది. కేవలం శవ రాజకీయాలు చేసేందుకు నిబంధనలు పక్కన పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
వాటిని సవరించుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే రేపటి రోజున ఓ ప్రతీప‌క్ష రాజకీయ నాయకుడు చనిపోతే ఇదే విధానం అమలు చేయనపుడు వస్తుంది అసలు రచ్చ.


మరింత సమాచారం తెలుసుకోండి: