నోటి దూల ఎంత దూర‌మైనా తీసుకు వెళ్తుంద‌ని చెప్ప‌డానికి మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తు న్నార‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు! టీడీపీలోని అతిత‌క్కువ మంది సీనియ‌ర్ మోస్టుల్లో అయ్య‌న్న కూడా ఒక‌రు. అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా ఆయ‌న టీడీపీలో చ‌క్రం తిప్పుతున్నారు. ఎంతో మంది పార్టీలు మారి తిరిగి టీడీపీ చెంత‌కు చేరుకున్నా.. అయ్య‌న్న మాత్రం ఒకే పార్టీలో ఉండిపోయారు. క‌ష్టాల్లో ఉన్న‌సుఖాల్లో ఉన్న పార్టీని విడిచి పెట్ట‌డం లేదు. అయితే, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న పార్టీలోని సొంత నాయ‌కుల‌పై చేస్తున్న విమ‌ర్శ‌లు తారా స్థాయికి చేరుకున్నాయి. అదేస‌మ‌యంలో ఆయ‌న పార్టీ అధినేత నిర్ణ‌యాల‌ను కూడా ప్ర‌శ్నించ‌డం తీవ్ర ఇబ్బందిక‌రంగా మారింది. 


నిజానికి పార్టీలో సీనియ‌ర్ అయిన ఆయ‌న పార్టీలో జ‌రిగే లోపాల‌ను ర‌హ‌స్యంగా ఉంచి, అధినేత‌తో చ‌ర్చించి ప‌రిష్క‌రిం చేందుకు కృషి చేయాలి. కానీ, నిత్యం మీడియాలో క‌నిపించాల‌నే త‌ప‌న ఆయ‌న‌ను అలా ఉండ‌నివ్వ‌లేదు. విశాఖ భూము ల బాగోతాన్ని తానే బ‌య‌ట‌కు తెచ్చాన‌ని, సొంత పార్టీ నేత‌ల‌పైనే ఆయ‌న ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. అదేస‌మ‌యంలో ఆయ‌న చంద్ర‌బాబు తెలంగాణాలో కాంగ్రెస్‌తో పొత్తుకు తెర‌దీయ‌డాన్ని తీవ్ర‌స్థాయిలో త‌ప్పుప‌ట్టారు. అయితే , ఇది కూడా ఆయ‌న బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేయ‌డంతో ఆయ‌న పేరు టాంటాం అయింది. దీంతో తీవ్ర‌స్థాయిలో అధిష్టానం ఆగ్ర‌హానికి గురికావాల్సి వ‌చ్చింది. 
ఇప్ప‌టికే ఒక‌ప‌క్క జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో బాబుపై నిప్పులు చెరుగుతున్నారు.

మ‌రోప‌క్క, మిత్రుడు అనుకున్న ప‌వ‌న్.. శ‌త్రువుగా మారి యుద్ధం చేస్తున్నారు. ఇవే.. చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారిన నేప‌థ్యంలో అయ్య‌న్న వ్యాఖ్య‌లు, మీడియా మీటింగులు మ‌రింత‌గా త‌ల‌నొప్పి ని తెచ్చిపెట్టాయి. దీంతో చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను అసెంబ్లీకి కాకుండా పార్ల‌మెంటుకు పంపాల‌ని, కాదు కూడదు.. అని ఎమ్మెల్యే టికెట్ కోసం ప‌ట్టుబ‌డితే.. ఏదీలేకుండా చేయాల‌ని కూడా నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చా యి. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన అయ్య‌న్న‌.. మారు మాటాడ‌కుండా.. ఎంపీగా వెళ్లేందుకు డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. 


వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధిష్టానం త‌న‌ను ఎక్క‌డ పోటీ చేయ‌మ‌న్నా చేస్తాన‌ని, వెరిచేది లేద‌ని ఇటీవ‌ల ఆయ‌న వెల్ల‌డిం చిన విష‌యాల‌ను బ‌ట్టి.. ఆయ‌న కు ఎంపీ టికెట్ ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయ్య‌న్న త‌న పేరును తానే పోగొట్టుకున్నార‌ని అంటున్నారు. కొస‌మెరుపు ఏంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వారుసుడిగా కుమారుడిని రంగంలోకి దింపాల‌ని అనుకున్నారు. కానీ, చంద్ర‌బాబు ఒకే టికెట్ ఇస్తాన‌ని చెప్ప‌డంతో అయ్య‌న్న ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏంజ రుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: