రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసిపినే అధికారంలోకి వస్తుందని టిఆర్ఎస్ చెబుతోంది. టిఆర్ఎస్ తాజా మాజీ ఎంఎల్ఏ, సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, ఏపిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధికారంలోకి వస్తాడంటూ జోస్యం చెప్పటం ఇపుడు చర్చనీయాంశమైంది. గతంలో కూడా ఏపికి కాబోయే ముఖ్యమంత్రి జగనే అంటూ ఒకటికి రెండు  సార్లు టిఆర్ఎస్ చీఫ్ కెసియార్ కూడా చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమధ్యనే కెసియార్ కొడుకు కెటియార్ కూడా జగనే కాబోయే సిఎం అంటూ చెప్పారు. చూడబోతే కెసియార్ ఫ్యామిలీతో పాటు టిఆర్ఎస్ పార్టి మొత్తం జగన్ కే మద్దతుగా నిలబడేట్లుంది.

 

కెసియార్, చంద్రబాబు మధ్య విభేదాలు పెరగటానికి ఇది కూడా ఒక కారణంగా తెలుస్తోంది. చంద్రబాబును  కెసియార్ ఎంత దూరం పెడతారో జగన్ తో అంత సన్నిహితంగా ఉంటారు. పోయిన ఎన్నికల్లో కెసియార్, చంద్రబాబులు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ముగ్గురు మధ్య ఇదే విధమైన వ్యవహారం నడుస్తోంది. దానికి తోడు అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే తెలంగాణాలోని ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎంఎల్ఏ ఓటు కొనుగోలుకు ప్రయత్నించి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. దాంతో చంద్రబాబు అంటేనే కెసియార్  మండిపోతున్నారు.  

 

అప్పటి నుండి ప్రతీ విషయంలోనూ చంద్రబాబును కెసియార్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఏం చేయాలో దిక్కుతోచని చంద్రబాబు ఆ కోపంతో కెసియార్ ను ఏమీ చేయలేక జగన్ ను లక్ష్యంగా చేసుకున్నట్లే  కనబడుతోంది.  దానికితోడు అప్పుడప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏపిలో అధికారంలోకి వచ్చేది జగనే అంటూ కిసియార్,కెటియార్ లాంటి నేతలు చెబుతుండటం పుండు మీద కారం చల్లినట్లుంటోంది చంద్రబాబుకు.


మరింత సమాచారం తెలుసుకోండి: