జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దీక్షను వేసుకోవడానికి రెడీ అయిపోయారు. తాజాగా ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో యాత్రను ముగించుకొని తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించి ముఖ్యంగా అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపించిన పవన్ కళ్యాణ్..త్వరలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర చేయబోతున్నారు.

Image may contain: 3 people, people smiling, people sitting and beard

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన దీక్ష విషయాన్ని వెల్లడించారు. కాగా గతంలో పవన్ ప్రతి ఏడాది చాతుర్మాస దీక్ష చేసేవారు. ఇప్పుడు అమ్మవారి దీక్షను చేపట్టనున్న పవన్.. తన దీక్షలో కేవలం పండ్లు, పాలను మాత్రమే ఆహారంగా స్వీకరించనున్నారు.

Image may contain: 1 person, beard and phone

తొమ్మిది రోజుల పాటు పవన్ ఈ దీక్షను చేయనున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరు ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని..కేవలం పార్టీ టికెట్ కోసం కాకుండా చిత్తశుద్ధితో ప్రజలపై ప్రేమతో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ నేతలకు తెలిపినట్లు సమాచారం.

Image may contain: 1 person, beard

ముఖ్యంగా అక్టోబర్ 15వ తారీఖున ధవలేశ్వరం బ్యారేజీపై చేయబోయే కవాతు ప్రోగ్రాం కి ప్రతి ఒక్కరు హాజరుకావాలని..దేశం మొత్తం సంచలనం అయ్యేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని..దసరా సెలవులు కనుక ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవ్వాలని పవన్ కళ్యాణ్ నేతలకు తెలియజేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: