నాయకులకు ధీమా ఉండాలి. అది అతి ధీమా కారాదు, అలాగే హుషార్ మాటలతో హోరెత్తించాలి. అది హద్దు దాటకూడదు, కానీ ఇపుడున్న రాజకీయం అలా కాదు. సుదీర్ఘ కాలం రాజకీయాలు చేసి తల పండిన నాయకులు సైతం నోరు జారేస్తున్నారు. ఓవరాయక్షన్ చేసేస్తున్నారు. అది క్యాడర్ కి ఇంపు కావచ్చు, బయట జనాలకు మాత్రం ఇబ్బందే మరి.


మేమే వస్తున్నాం :


మరో ఆరు నెలల్లో ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది వైసీపీయేనని ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి కడు ధీమాగా చెప్పారు. విశాఖలో ఈ రోజు పార్టీ మీటింగులూ మాట్లాడిన అయన ఆరు నూరు అయినా రేపటి ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని క్లారిటీగా చెప్పేశారు. ఏపీలోని పదమూడు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు ఒకేలా జనం బ్రహ్మరధం పడుతున్నారంటే టీడీపీపై ఎంతటి వ్యతిరేకత ఉందో అర్ధం అవుతోందని  అన్నారు.


విశాఖలో స్వీప్ :


విశాఖలో మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లను సాధిస్తామని విజయసాయి చెప్పుకొచ్చారు. ఇందుకు కంచరపాలెంలో జగన్ మీటింగ్ ఒక ఉదాహరణ అన్నారు. జనం ఆ మీటింగుకు పోటెత్తారని, టీడెపీ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయని చెప్పారు. ఇక టీడీపీకి ఆరు నెలల వరకూ తాము విశాఖలో అన్ని సీట్లు గెలుస్తామన్న ధీమా ఉండేదని జగన్ పాదయాత్రతో అది తుడిచిపెట్టుకుపోయిందని విజయసాయి అన్నారు.


మూడు దశాబ్దాల పాలన :


జగన్ అధికరంలోకి వస్తే మూడు దశాబ్దాల పాటు ఏపీని పాలిస్తారని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. ప్రజలకు మంచి పాలన అందించే సత్తా జగన్ కే ఉందని అన్నారు. జగన్ వస్తే టీడీపీ అరాచకాలపై విచారణ జరిపిస్తామని, ఎవరూ ఇప్పటి నుంచే పెట్టే బేడా సర్దుకోకుండా ముఖ్య నాయకుల పాస్ పోర్టులను రద్దు చేయాలని విజయసాయిరెడ్డి అన్నారు. 


విజయాల విశాఖ :


వైసీపీకి విశాఖ ఇకపై అన్ని విధాలుగా కలసి వస్తుందని అన్నారు. పోయిన ఎన్నికల్లో కేవలం మూడంటే మూడు సీట్లు వచ్చాయని, ఇపుడు సీన్ మారిందని మొత్తానికి మొత్తం సాధిస్తామని, ఇంక టీడీపీ దుకాణం మూసేయాల్సిందేనని   సెటైర్లు వేశారు. వంచనపై దీక్షతో పాటు, జగన్ పాదయాత్ర ఇలా అన్ని కార్యక్రమాలు విశాఖ ప్రజలు విజ‌యవంతం చేశారని ఇది విజయానికి సూచిక అన్నారు. మొత్తానికి జగన్ కుడి భుజం విజయసాయి స్పీచ్ పార్టీకి జోష్ తెస్తూనే టీడీపీకి అటాక్ ఇస్తూ సాగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: