తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ప్రచారపర్వంలో మునిగిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో తనకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడిన మహాకూటమి పార్టీ నాయకులపై ముఖ్యంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో సంచలన కామెంట్ చేస్తున్నారు.

Image result for tdp mla dayakar reddy

ఈ క్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీడీపీ నేత దయాకర్ రెడ్డి కెసిఆర్ పై సంచలన కామెంట్ చేశారు.

Image result for tdp mla dayakar reddy kcr

మెహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట లోని జరిగినటువంటి ఒక మీటింగులో దయాకర్ రెడ్డి కెసిఆర్ మీద మాటాడుతూ కెసిఆర్ చంద్రబాబు మీద అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదు అని తెలిపారు.కెసిఆర్ తాను మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు పని అయ్యిపోయినట్టే అన్న మాటలకు గాను నేను తొడ కొట్టి మరీ కెసిఆర్ కు సవాల్ చేస్తున్నా దమ్ముంటే మూడో కన్ను తెరువు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Image result for tdp mla dayakar reddy

కెసిఆర్ కు నిజంగా దమ్ముంటే,మగాడివి ఐతే చంద్రబాబుని అరెస్ట్ చేయించు చూద్దాం అని మండిపడ్డారు. అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మారాలని కోరుకుంటున్నారని..బంగారు తెలంగాణ కెసిఆర్ వల్ల కాదని..ప్రతి తెలంగాణ పౌరుడు అంటున్నారని టిడిపి నేతలతో దయాకర్ రెడ్డి తెలిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి: