పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్ర లో అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ మీద ఓ రేంజ్ లో విమర్శలు చేస్తూ సాగిపోతున్నాడు అయితే అక్కడక్కడ పవన్ మాటలు ఎవరికీ అర్ధం కావడం లేదు. జనసేన విజయం సాధిస్తుందని భయపడి.. చంద్రబాబునాయుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. పంచాయతీల్లో గ్రామాల్లో జనసేన పార్టీ చాలా బలంగా ఉన్నదని, జనసేన గెలిస్తే తన పరువు పోతుందని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు.


ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేనకు దైర్యం సరిపోవడం లేదు... సమాజాన్ని ఇంకేం మారుస్తుంది...!

తనకు నలుగురు పిల్లలున్నారని, సర్పంచి ఎన్నికలకు తాను అనర్హుడినని, చంద్రబాబు ధైర్యంగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని కూడా  పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయినా పవన్ కల్యాణ్ ఒక్కడూ ఒకవేళ సర్పంచిగా నిలబడి ఒక పంచాయతీలో గెలవడం గురించి ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు అస్సలు పవన్ సర్పంచ్ గా ఎందుకు పోటీ చేస్తాడు. పవన్ కే తెలియాలి. 


ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేనకు దైర్యం సరిపోవడం లేదు... సమాజాన్ని ఇంకేం మారుస్తుంది...!

ఇంకా కొన్ని టీడీపీ మీద పదునైన విమర్శలు చేసినాడు. పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ మరోసారి చింతమనేని ప్రభాకర్ పై దండెత్తారు. వారం రోజుల్లోగా చింతమనేనిని విప్ పదవినుంచి తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలగించకపోతే.. ఆయన మీద ఎస్సీ ఎస్టీ కమిషన్ కు, గవర్నర్ కు తానే ఫిర్యాదు చేస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.  ముఖ్యమంత్రి పదవి అనేది చంద్రబాబు కుమారుడికి, మనుమడికి, జగన్ కు వారసత్వమేమో గానీ.. తనకు మాత్రం బాధ్యత అని అందుకే అంత నిస్వార్థంగా పనిచేస్తానని పవన్ అంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: