రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ఉన్న వాటినే పరిగణనలోకి  తీసుకుంటారు. వ్యతిరేకంగా ఏమైనా వస్తే మాత్రం భోగస్ అంటారు. ఈ రెండు మాటల విధానం  బాగా అలవాటు చేసుకున్నారు. బట్టలు మార్చుకున్నంత ఏజీగా సిధ్ధాంతాలను మార్చేస్తున్న ఈ రోజుల్లో నేతాశ్రీలను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.


అది దొంగ సర్వే :


ఈ మధ్యన సీ ఓటర్ పేరిట ఓ సర్వే వచ్చింది ఆ సర్వేలో ఏపీకి సంబంధించి చూస్తే వైసీపీకి మొత్తం పాతిక ఎంపీ సీట్లకు గాను ఇరవై ఒకటి వస్తాయని తేల్చింది. అదే సర్వే దేశవ్యాప్తంగా బీజేపీకి సీట్లు బాగా తగ్గుతాయని చెప్పుకొచ్చింది. ప్రాంతీయ పార్టీల బలాలు కూడా పెరుగుతాయని స్పష్టం చేసింది. దాన్ని పట్టుకుని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ మీటింగులో దొంగ సర్వే అనేశారు. అలాంటి వాటిని నమ్మొద్దంటూ కూడా నాయకులకు స్పష్టం చేశారు.


బీజేపీ సర్వేట‌ :


బాబు గారు అలా అనగానే అనుంగు అనుచరుడైన దేవినేని ఉమా మహేశ్వరరావు మరో అడుగు ముందుకేసి అది బీజేపీ సర్వే అంటూ కొత్త నినాదం అందుకున్నారు. ఆ సర్వేని నమ్ముకుని జగన్ ఊహల్లో విహరిస్తున్నారుట. ఆయన పాదయాత్ర తరువాత కాశీయాత్ర చేయాల్సిందే తప్ప అధికారం దక్కదట. ఇదీ దేవినేని వారి జోస్యం


లాజిక్ మిస్ :


సీ ఓటర్ సర్వే నిజానికి చెప్పిందేమిటి, కేంద్రంలో మోడీ సర్కార్ కి సొంతంగా మెజారిటీ రాదని కదా. పైగా బీజేపీ యూపీలో సీట్లను బాగా కోల్పోతుందని కూడా చెప్పుకొచ్చింది. మరి  అది బీజేపీ సర్వే అయితే తమ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని ఎక్కడైనా చెప్పుకుంటారా. ఇక దొంగ సర్వే అంటున్న బాబు తో సహా టీడీపీ నేతలు ఇవే సర్వేలను ఆధారం చేసుకునే కదా నాలుగు రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోతుందని, కేంద్రంలో మళ్ళీ మోడీ రాడని డబ్బా కొడుతున్నారు.
ఈ సర్వేలనే కదా టీడీపీ అనుకూల మీడియా పెద్ద అక్షరాలతో భారీ హెడ్డింగుల్లో అచ్చేసింది. అంటే ఏపీ విషయానికి  వస్తే మాత్రం ఆ సర్వే భోగస్, తప్పుల తడక అయిందన్న మాట. ఈ లాజిక్ ని టీడీపీ మిస్ చేసినా జనాలు బాగానే అర్ధం చేసుకుంటున్నారుగా


యాంటీ ఇంకెంబెన్సీ ఉండదా :


అసలు ఏ రాష్ట్రం తీసుకున్నా అయిదేళ్ళు పాలించిన పార్టీకి యాంటీ ఇంకెంబెన్సీ అన్నది ఉండదా. ఇది సాధారణ విషయం. అది ఎక్కువై తుపానుగా మారితే భారిగానే తేడాలు వస్తాయి. ఫార్టీ యియ‌ర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు తన  పాలనపై జనంలో వ్యతిరేకత తెలియకుండా ఉంటుందా. ఇక్కడ సర్వేలు అన్నవి సాంకేతికం. జనం ఎపుడూ మార్పు కోరుతూ ఉంటారు. అవకాశం ఉన్న చోట మరో పార్టీనీ గెలిపిస్తారు.  దానికి సర్వేలను నిందించి ప్రయోజనం లేదు. లోపాలు ఉంటే సరిదిద్దుకుని ముందుకు సాగేందుకు సర్వేలను పాజిటివ్ గా తీసుకోవాలంతే.



మరింత సమాచారం తెలుసుకోండి: