రాజకీయాలు అన్నవి ఓ టిపికల్ సబ్జెక్ట్. జనం భాష తెలియాలి. వాళ్ళతో మమేకం కావాలి. వాళ్ళను అర్ధం చేసుకోవాలి. నాయకుడు, జనం మధ్య తెలియని సూత్రమేదో గట్టిగా ముడి పడాలి. అపుడే  ఆ నాయకుడు సక్సెస్ అవుతాడు. ఎన్నో రంగాలు ఉన్నాయి. సాధన చేస్తే అక్కడ రాణించవచ్చు. కానీ రాజకీయ రంగం అలా కాదు. ఇక్కడ ఒడిదుడుకులు ఛాలా ఉన్నాయి. తట్టుకోవ‌డం చాలాకష్టం.


సినిమా వైపు నుంచి :


సినిమా రంగం  ఓ వినోద రంగం. జనాలను ఇక్కడ ఆకాట్టుకోవడమే పని. కానీ ఆ ఆకట్టుకోవడం వెనక ఓ కనికట్టు ఉంది. వెండి తెర మ్యాజిక్ ఉంది. అదే రాజకీయ రంగంలో అయితే అలాంటివి ఏవీ ఉండవు, ఇక్కడ రియల్ లైఫ్ ఉంటుంది. జనంలోకి పోవాలంటే వ్యక్తిత్వం బయట పడుతుంది. దానికే మార్కులు ఉంటాయి. ముఖంగా నమ్మకం మీద రాజకీయం సాగుతుంది. అందుకే అందరూ ఓ అన్న గారిలా ఇక్కడ రాణించలేకపోతున్నారు.


ఆధ్యాత్మిక రంగం :


ఇది చాలా పవిత్రమైనది, ముఖ్యంగా మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఓ వయసు వాళ్ళంతా ఆ రంగానికి ఆకర్షితులుగా ఉంటారు. ఈ రంగంలో ఉన్న వారు చెప్పే మంచి మాటలను సమజం జాగ్రత్తగా ఆలకిస్తుంది. గౌరవంగా చూస్తుంది. కానీ వారు దేవుడికి సంబంధించిన మాటలు తప్ప వేరేదైన చెబితే మాత్రం జనం వింటారా


పారిశ్రామిక రంగం :


ఈ దేశంలో అతి పెద్ద రంగం పారిశ్రామిక రంగం. ఈ రంగంలో కూడా ఎంతో మంది సంపన్నులు ఉన్నారు. కోట్లకు పడగెత్తారు. వారి వల్లనే దేశ ఆర్ధిక చక్రం పరుగులు పెడుతోంది. వారు మాత్రం బయటకు కనిపించరు. ఆలంటి వారు రాజకీయ తెరపైకి వస్తే ఓట్లేసే సాదర జనం ఎలా రియాక్ట్ అవుతారు. చెప్పాలంటే తాము నమ్మని వాడు ఎంతటి పెద్ద వారు అయినా జనం పట్టించుకోరు.  ఈ దేశంలో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు కూడా.


మ్యాటర్ అదీ :


ఓ రంగంలో గొప్ప వాడని తెచ్చి వేరే రంగంలో పెడితే జీరో అవుతాడు. మరీ ముఖ్యంగా జనమే పెట్టుబడిగా ఉండే రాజకీయ రంగం అందరికీ అచ్చిరాదు. సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్. ఆయన రాజకీయాల్లోకి వస్తే జనం ఆదరించలేదు. ఓ మామూలు ఎంపీగా మిగిలిపోయాడు. 


పరిపూర్ణమేనా :


ఇపుడు రాజకీయాల్లోకి పరిపూర్ణానంద వస్తున్నారని టాక్. మరి ఈ స్వామీజీ బోధనలు అందరికీ ఇష్టమే. కానీ రాజకీయ తెరపై ఈయన్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారన్నది వేచి చూడాలి. యూపీలో అదియానాధ్ యోగి ప్రయోగం బీజేపీ తెలంగాణాలో చేయాలనుకుంటోంది. మరి దానికి జనం సిధ్ధంగా ఉన్నారా. ప్రవచనాలు చెప్పే స్వామి ఎన్నికల ప్రసంగం ప్రజలను కదిలిస్తుందా, ఇవన్ని తెలియాలంటే కొంత కాలం ఆగాలి. అన్నట్లు పరిపూర్ణానంద అమిత్ షా ని కలిసారు. విజయదశమి తరువాత ఆయన రాజకీయ ప్రకటన ఉండొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: