వ్యవసాయరంగంలో చంద్రబాబునాయుడుకు ప్రతిష్టాత్మక  అగ్రికల్చరల్ గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు వచ్చింది. అదికూడా దేశంలో వ్యవసాయరంగంలో ప్రముఖ శాస్త్రవేత్తగా పేరున్న ప్రొఫెసర్ స్వామినాథన్ ఎంపిక చేశారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటుండదు. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్నే నాశనం చేయాలనే కంకణం కట్టుకుని ఓ పద్దతి ప్రకారం ముందుకెళుతున్న చంద్రబాబుకు వ్యవసాయరంగంలో అవార్డు రావటం విడ్డూరంగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సంక్షేమం కోసం, సాధికారత కోసం విశేషంగా కృషి చేసే వ్యక్తులు, సంస్ధలకు ఈ అవార్డును ప్రకటిస్తుంటారు.

 

గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయరంగంలో ప్రగతి సాధించినందుకు, పల్లెల సౌభాగ్యానికి కృషి చేస్తు, రాష్ట్రాభివృద్ధికి విశేషంగా విజన్ డెవలప్ చేసినందుకు చంద్రబాబుకు స్వామినాథన్ అవార్డు ప్రకటించటం విశేషం. వ్యవసాయరంగంలో చంద్రబాబు ట్రాక్ రికార్డు అందరికీ తెలిసిందే. వ్యవసాయమే శుద్ధ దండగ అంటూ బహిరంగంగా ప్రకటించిన గొప్ప నేత చంద్రబాబు. అటువంటి చంద్రబాబుకు వ్యవసాయరంగం అభివృద్ధికి కృషి చేశారంటూ అవార్డు ఇవ్వటం రైతులను అవమనించటమే.

 

2014లో అధికారంలోకి వచ్చిన  తర్వాత సుక్షేత్రమైన పచ్చని వేలాది ఎకరాలను రాజధాని పేరుతో రైతుల నుండి లాగేసుకున్నది ఇదే చంద్రబాబు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వటం ఇష్టం లేదని చెప్పిన రైతుల పొలాలు తగలబడింది కూడా చంద్రబాబు హయాంలోనే అన్న విషయం అందరికీ తెలిసిందే.  రైతులు సాగు చేసుకుంటున్న వేలాది  ఎకరాలను భూ సమీకరణ పేరుతో గుంజుకుని పరిశ్రమలకు ఇచ్చేస్తున్న విషయం స్వామినాథన్ కమిటీకి తెలియదా ? పైగా ప్రకృతి వ్యవసాయం అనే పాతకాలపు పద్దతులను ఇపుడే తానే కనుక్కున్నంత బిల్డప్ ఇస్తున్నారు. దానికే స్వామినాథన్ కమిటీ అవార్డు ఇచ్చినట్లుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: