ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కొడుకు కెఈ శ్యాంబాబు అరెస్టుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శ్యాంబాబుతో పాటు ఎస్ఐ నాగ తులీ ప్రసాద్ ను కూడా వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించటం సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే, దాదాపు రెండు సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లాలోని పత్తిపాడు నియోజకవర్గం వైసిపి ఇన్చార్జి చెఱుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హత్యకు గురయ్యారు. అప్పట్లో ఆ హత్య రాష్ట్రంలో సంచలనం రేపింది.

 

అప్పటికే ప్రత్యర్ధుల నుండి తన ప్రాణాలకు ముప్పుందంటూ నారాయణరెడ్డి పోలీసులను ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదు. చివరకు ఆయన ఆందోళన చెందినట్లుగానే ప్రత్యర్ధుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆ హత్య చేసింది కెఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబే అంటూ నారాయణరెడ్డి భార్య శ్రీదేవిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరే సహజంగానే పోలీసులు పట్టించుకోలేదు లేండి. అందుకే శ్రీదేవి శ్యాంబాబుతో పాటు పోలీసులపైన కూడా కేసు వేసింది.

 

ఆ కేసును విచారించిన కోర్టు శ్యాంబాబుతో పాటు ఎస్ఐ అరెస్టుకు ఆదేశించింది. అయితే, వాళ్ళు అరెస్టు కాకుండా స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే ఇపుడు వెకేట్ అయిపోయింది. దాంతో శ్రీదేవి పిటీషన్ పరిశీలించిన డోన్ కోర్టు వెంటనే శ్యాంబాబుతో పాటు ఎస్ఐను కూడా అరెస్టు చేయాలంటూ ఆదేశించింది. మరి కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు అరెస్టులు చేస్తారా అన్నది చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: