అదేంటో సీట్ల విషయం వచ్చేసరికి పార్టీలో గ్రూపులన్నీ భగ్గుమంటాయి. అంతవరకూ ఒక్కటిగా పోజులిచ్చిన వారంతా శత్రువులైపోతారు. అధినేతలకు శిరోభారంగా టికెట్ల పంపిణీ వ్యవహారం ప్రతీ పార్టీలోనూ తయారవుతోంది. అక్కడ నుంచి అలకలు, అసంత్రుప్తులు అదొక పెద్ద టీవీ సీరియల్ మాదిరిగా అయిపోతోంది.


ప్రత్తిపాడు అతనికే :


ఎన్నికల వేళ టైం వేస్ట్ చేసుకోకుండా వైసీపీ మెల్లగా టికెట్ల పంపిణీ స్టార్ట్ చేసేసింది. కోపాలు, తాపాలు అన్నీ ఇపుడే చూసుకుంటే ఎన్నికల వేళ హ్యాపీగా ఉండొచ్చన్న ఉద్దేశ్యమో మరేమో కానీ మెల్లగాన అనధికారికంగా టికెట్లు ఇచ్చేదెవరికో చెప్పేస్తోంది. అలా తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు టికెట్ ను పర్వత సుబ్బా రావుకు కన్ ఫార్మ్ చేసినట్లుగా భోగట్టా. జగన్ బాబాయి పార్టీలో పెద్ద తలకాయ అయిన వైవీ సుబ్బారెడ్డి సమక్షంలోనే ఈ టికెట్ ప్రకటన జరిగిపోయింది.


ఆ వర్గం డుమ్మా :


మరి ఈ విషయం ముందే తెలుకున్నారో లేక బయటకు  వాసన పొక్కిందో తెలియదు కానీ ఇక్కడ టికెట్ ఆశిస్తున్న రెండవ వర్గం మురళీక్రిష్ణ రాజుకు చెందిన వారంతా  కొట్టేశారు. . చిత్రమేమిటంటే ఆ వర్గం వైపు ఉన్నారని ప్రచారంలో ఉన్న జిల్లా వైసీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు కూడా గైర్ హాజరు కావడం. మొత్తానికి చూసుకుంటే ఒకరికి మోదం, మరోకరికి ఖేదం అన్నట్లుగా వైసీపీ మీటింగ్ సాగింది.


అనుకూలమే :


చెప్పాలంటే క్యాడర్ బేస్ పర్వత ప్రసాద్ కే ఎక్కువగా ఉంది. అది కార్యకర్తల‌ మీటింగులో స్పష్టమైంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజర్ కావడం ప్రసాద్ బలాన్ని తెలియచేస్తోంది. మొత్తానికి జాగ్రత్తగా వర్క్ చేసుకుంటే ప్రత్తిపాడు వైసీపీ ఖాతాలో పడడం ఖాయమని అంతా భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: