ఓ వైపు కేంద్రంలో రేపటి రాజ్యం తమదేనని జబ్బలు చరచుకోవడమే కాదు. ఏపీలోనూ వచ్చేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు తెగ ఊదర గొడుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. ఉన్న పాటి నాయకులు కూడా జెండా ఎత్తేస్తున్నారు. సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు. అంటే నాయకులకే నమ్మకం కలగని ఖద్దరు పార్టీ ప్రచారం కచ్చితంగా జనాలను మభ్యపెట్టేందుకేనని మరో మారు అర్ధమైపోతోంది కదూ..


సీనియర్ నేత జంప్ :


కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  సీ రామచంద్రయ్య కాంగ్రెస్ ని వీడనున్నారా. అంటే సమాధానం అవుననే వస్తోంది. ఆయన పూర్వాశ్రమంలో టీడీపీ నాయకుడు. బాబు అప్పట్లో ఆయన్ని రాజ్య సభకు పంపించారు. దానికి తగినట్లుగా ఆయన కూడా తన సామర్ధ్యాన్ని నిరూపించుకుని భేష్ అనిపించుకున్నారు. ఆ తరువాత ప్రజారాజ్యం ఏర్పాటు లో కీలక మైన పాత్ర పోషించారు. ఆ పార్టీ తరఫున  మంత్రి కూడా అయ్యారు.


శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ :


ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనానంతో ఆ పార్టీలో రామచంద్రయ్య చురుకైన పాత్ర నిర్వహించారు. ఆయన శాస‌న మండలిలో ఫ్లోర్ లీడర్ గా కూడా పనిచేశారు. బాబుని సరైన లాజికల్ కొశ్ఛ‌న్స్ తో ఇరకాటంలో పెట్టడంలో ఆయన సిధ్ధహస్తుడు. ఎమ్మెల్సీ పదవీకాలం అయ్యాక కూడా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మరీ  బాబు సర్కార్ ని తూర్పారా పట్టడం మానలేదు. ఇపుడు ఏపీలో కొత్త పొత్తులు పొడవడం, కాంగ్రెస్ తో టీడీపీ దోస్తీకి రెడీ అవడంతో బాబు అంటే విభేదించే రామచంద్రయ్య తన దారి తాను చూసుకోనున్నారు.


జనసేనలోకే :


కడప జిల్లాలో మంచి లీడర్ గా ఉన్న రామచంద్రయ్య బలిజ సామజిక వర్గానికి చెందిన వారు. ప్రజారాజ్యం లో పనిచేసిన ఆయన ఇపుడు జనసేనలోకి రానున్నట్లు భోగట్టా. పవన్ తో మంచి పరిచయాలు ఉండడమే కాదు, చిరంజీవి కుటుంబ సభ్యునిగా ఆయన  మెగా ఫ్యామిలీకి అతి సన్నిహితంగా ఉంటారు. ఇపుడు జనసేనకు సరైన యకుల కొరత ఉన్న టైంలో రామచంద్రయ్య రాక మంచి పరిణామం అంటున్నారు. అతి తొందరలోనే ఆయన ఖద్దర్ దుస్తులను వదిలేసి జనసేన జెండా కప్పుకుంటారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: