దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హాల్లో సాధారణంగా కనిపించని అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గ్రేటర్ నోయిడాకు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌ అమ్రపాలి ప్రమోటర్‌ అనిల్‌ శర్మను, డైరెక్టర్లను కోర్టు రూమ్‌ లోనే అరెస్ట్‌కు ఆదేశాలను జారీచేసింది సుప్రీంకోర్టు. "ఇక మీ దాగుడు మూతలు ఆపండి" అంటూ, అమ్రపాలి గ్రూప్‌ డైరెక్టర్ల పై సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. వెంటనే వారిని కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, ఉదయ్‌ లలిత్‌ ల నేతృత్వం లోని బెంచ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

ఒక గంటపాటు జరిగిన విచారణలో, ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కోసం అమ్రపాలి గ్రూప్‌ సమర్పించాల్సిన పలు డాక్యుమెంట్లను ఇవ్వకుండా దాగుడు మూతలు ఆడుతుందని డైరెక్టర్లపై మండిపడింది. డాక్యుమెంట్లను సమర్పించకపోవడానికి పలు కారణాలను చెబుతూ తప్పించుకుంటున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గృహ కొనగోలు దారులు పెట్టుబడిగా పెట్టిన నగదును, మరో అవసరాల కోసం తరలించారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. వెంటనే అనిల్‌ శర్మకు, ఇద్దరు డైరెక్టర్లకు సమన్లు జారీ చేసింది. అన్ని డాక్యుమెంట్లు ఆడిటర్లకు సమర్పించేంత వరకు మీరు కస్టడీ లోనే ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది. అది ఒక్క రోజు పట్టవచ్చు లేదా నెల రోజులు పట్టవచ్చు అని ధర్మాసనం పేర్కొంది. 
Image result for amrapali group chairman name
రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌ అమ్రపాలికి సంబంధించిన పత్రాలన్నింటిన్నీ సీజ్‌ చేయాలని ఢిల్లీ పోలీసులను, నోయిడా పోలీసులను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. డాక్యుమెంట్ల ను రికవరీ చేసుకోవడానికి, ఈ ముగ్గురిని పోలీసులు ఆమ్రపాలి ఆఫీసుల చుట్టూ తిప్పాలని పేర్కొంది. అన్ని డాక్యుమెంట్లను ఆడిటర్లు పొందినట్టు తెలిసిన తరవాతనే వారిని వదిలి వేయాలని బెంచ్‌ స్పష్టం చేసింది. ఈ ముగ్గురి పాస్‌ పోర్టులను కూడా కోర్టు రద్దు చేసింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 24 కు వాయిదా వేసింది. ఇలా నిందితులను కోర్టు రూమ్‌ లోనే అరెస్ట్‌ చేయడం గతంలో సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతా రాయ్‌ ను సుప్రీంకోర్టు, రూమ్‌ లోనే అరెస్ట్‌ చేసిన చరిత్ర ఉంది. 
Image result for amrapali real estate 

మరింత సమాచారం తెలుసుకోండి: