తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎన్నికల ముందు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్న కేసీఆర్ తాజా షాక్ తో డైలమాలో పడ్డారట. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన రోడ్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా పని చేస్తున్న తూంకుంట నర్సారెడ్డి పార్టీలో తనకు జరుగుతున్న అవమానం బట్టి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ అయినట్లు తెలంగాణలో వార్తలు గట్టిగా కనబడుతున్నాయి.

Image result for తూంకుంట నర్సారెడ్డి కెసిఆర్

ఈ క్రమంలో గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి తూంకుంట నర్సారెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో రహస్య భేటీ కావడం విశేషం. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తనను ఉత్తమ్ పరామర్శించేందుకు వచ్చారని నర్సారెడ్డి చెబుతున్నప్పటికీ నర్సారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని ఆయన సన్నిహితులే పేర్కొంటుండడం గమనార్హం.

image

గత ఎన్నికల్లో చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకొని కేసీఆర్ గెలుపుకు పరోక్షంగా దోహదపడ్డ నర్సారెడ్డి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక క్యాడర్, మాస్ ఇమేజ్ ఉన్న లీడర్‌గా గుర్తింపు పొందారు. అంతేకాకుండా గతంలో తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి టిఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు.

Image result for తూంకుంట నర్సారెడ్డి

అయితే తాజా రాజకీయ పరిణామాలు బట్టి తనకు పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడంతో తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లి పోతున్నట్లు తెలంగాణ పొలిటికల్ లో వి నపడుతున్న హాట్ టాపిక్. తాజా పరిణామంతో ఎన్నికల ముందు కెసిఆర్ కి కాంగ్రెస్ పార్టీ పెద్ద షాకే ఇచ్చింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




మరింత సమాచారం తెలుసుకోండి: