జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి లో ప్రజా పోరాట యాత్ర చేస్తున్న సమయంలో అక్కడున్న ప్రజలతో సమావేశం అయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజా సమస్యలపై పోరాటం కోసం కానీ అధికారం కోసం కాదని పేర్కొన్నారు. నిజంగా నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవాడిని అని పేర్కొన్నారు.

Image may contain: 1 person, beard and text

గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనను జనసేన పార్టీని బిజెపి పార్టీ లో కలపాలని..కలిపితే ముఖ్యమంత్రి చేస్తామని ఆనాడు వారు ఆఫర్ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే తాను కేవలం రాజకీయాల్లో క్లీన్ పాలిటిక్స్ చేయడం కోసమే వచ్చానని బదులివ్వడంతో ...తన పార్టీని ఇతర పార్టీల కలిపే వాడిని కాదని పేర్కొనడంతో వారే మాట్లాడలేక పోయారని గుర్తు చేశారు పవన్.

Image may contain: 2 people, people on stage and beard

తనకి వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయ్యే కోరిక లేదని..ఏదైనా సమస్య తెలిస్తే వెంటనే పరిష్కరిస్తామని..అంతేగాని జగన్ లా ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తామని చెప్పడం నాకు తెలియదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2016లో ప్రత్యేకహోదా అంశంపై కేంద్రానికి గుర్తు చేసింది తానేనని పవన్ స్పష్టం చేశారు.

Image may contain: 1 person, beard

అరచేతితో సూర్యకాంతిని అడ్డుకోలేరని, జనసేన ఎదుగుదలను ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రక్షాళన కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. భవిష్యత్తులో కూడా రాజకీయాలు కులాలకు మతాలకు..ప్రాంతీయ తత్వానికి తన పార్టీలో చోటు లేకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు...నా దగ్గర టీవీ ఛానల్..వార్తాపత్రికలు లేవని నాకున్న బలం కేవలం నా అభిమానులేనని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.




మరింత సమాచారం తెలుసుకోండి: