మావోయిస్టుల పేరుతో విశాఖ ఏజెన్సీలో వెలువడిన ఓ లేఖ కలకలం స్రుష్టిస్తోంది. తామెందుకు అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హత్య చేశామన్నది ఆ లేఖలో పెర్కొనడంతో కలకలం మొదలైంది. నిజానికి మావోలు ఎపుడు ఇంత ఆలస్యంగా స్పందించారు. అది నిజంగా  మావోల లేఖేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


లెట‌ర్ హెడ్ మీద కాదు :


మావోలు లేఖ రాసినపుడు లెట‌ర్ హేడ్ ఉపయోగిస్తారు. వారు తమ వివరాలు, హోదా వంటివి కూడ అందులో ప్రస్తావిస్తారు. కానీ మావోల లేఖ పేరుతో తాజాగా వెలువడిన ఉత్తరం సర్వత్రా చర్చనీయాశం అవుతోంది. అది ఓ తెల్ల కాగితం మీద రాసిన సాధారణ ఉత్తరంగా ఉంది. అదీ హత్య జరిగిన పదిహేడు రోజుల తరువాత మావోల లేఖ రావడమూ పలు సందేహాలకు తావు ఇస్తోంది. దీనిపైన  పోలీసులు కూడా మల్ల గుల్లాలు పడుతున్నారు.


అవన్నీ పాత విషయాలే :


ఇక మావోలు లేఖ ప్రస్తావించిన  వాటిలో కొత్త విషయాలు ఏమీ లేవు. అవన్నీ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారు, ఏజెన్సీ లో ఉన్న వారు ఎరిగిన విషయాలే. మావోల గురి అధికార పార్టీ నాయుకలపై ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కట్టుదిట్టమైన భద్రత కూడా కల్పించారు.  దాంతో పాటు మరేమైన ప్రస్తావించి ఉంటే అది మావోల లేఖ అని గట్టిగా నిర్దారించుకునేందుకు అవకాశాలు ఉండేవని పోలీసులు  వర్గాలతో పాటు అంతా అభిప్రాయపడుతున్నారు.


లేఖపైనా దర్యాప్తు  :


తాజా పరిణామాల నేపధ్యలో అసలు లేఖ ఎలా వచ్చింది. దాని వెనక కధేంటన్న దానిపైన కూడా ఇపుడు పోలీసులు కొత్త దర్యాప్తు ప్రారంభించారు. మావోయిస్టులు హత్యలు చేసేటపుడు తామేనంటూ  బాధ్యత తీసుకుంటారని, కానీ ఇపుడు ఏ పేరూ ఏమీ లేకుండా వచ్చిన ఈ లేఖ ఎంతవరకు నమ్మదగ్గది అన్న దానిపైన పోలీసులు ద్రుష్టి సారించారు. మొత్తానికి మావోయిస్టుల వ్యవహారం పోలీసులకు సవాల్ గానే మారిందని చెప్పుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: