వినటానికి ఆశ్చర్యంగానే ఉన్న దాదాపు ఇదే నిజం. అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్ధులకు ఏం కొదవ అని అందరికీ అనుమానం రావచ్చు. కానీ క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం నిజమే అని అంగీకరించక తప్పదు. విషయం ఏమిటంటే,  రాష్ట్రంలోని మొత్తం 25 లోక్ సభ సీట్లలో కనీసం 13 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను రంగంలోకి దింపే విషయంలో చంద్రబాబు పెద్ద కసరత్తే చేస్తున్నారట. పోటీకి నేతలు వెనకాడాల్సిన అవసరం ఏంటి ? చంద్రబాబు అంతగా కసరత్తు చేయాల్సిన పనేంటి? అంటే పరిస్ధితులు అలాగున్నాయట.

 

చంద్రబాబు నాలుగున్నరేళ్ళ పాలన ఎంత సవ్యంగా సాగుతోందో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ విధంగా చూసినా ఫెయిల్యూర్లే ఎక్కువగా కనబడుతున్నాయి. పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు. పైగా అప్పట్లో హామీలిచ్చి తప్పటం వల్ల కాపు, బిసిల్లాంటి  సామాజికవర్గాలు ఇపుడు చంద్రబాబుపై మండిపోతున్నాయి. సరే, ఇవన్నీ పక్కనపెడితే ప్రత్యేకహోదా, నిరుద్యోగం, అవినీతి లాంటి అంశాలతో జనాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. రాష్ట్ర రాజకీయాలపై జాతీయ మీడియా చేసిన సర్వేల్లో ఆ విషయాలు స్పష్టంగా బయపడిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే, గెలుపుపై నమ్మకం లేకే చాలామంది ఎంపిలు, నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి భయపడుతున్నారని సమాచారం. శ్రీకాకుళం, అనంతపురం, కాకినాడ, విజయనగరం, అమలాపురం, బాపట్ల, నరసరావుపేట, మచిలీపట్నం ఎంపిలు ఇప్పటికే తాము మళ్ళీ పార్లమెంటుకు పోటీ చేయటం లేదని చెప్పేశారట. ఇక, చిత్తూరు, రాజమండ్రి, ఏలూరు ఎంపిలకు టిక్కెట్లివద్దని స్ధానిక నేతలే చంద్రబాబుకు చెబుతున్నారట.  సరే, వీరి సంగతులు పక్కనపెడితే మొన్న వైసిపి ఎంపిలు రాజీనామాలు చేసిన తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, రాజంపేట, కడప నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి నేతలు వెనకాడుతున్నారు.


ఈ విషయాలను పక్కనపెట్టిన చంద్రబాబు ఎంపిలుగా పోటీ చేసే విషయంలో పలువురు మంత్రులతో మాట్లాడారట. శ్రీకాకుళంలో పోటీ చేయటానికి అచ్చెన్నాయడు ఇష్టపడటం లేదట. విజయనగరంలో పోటికి సుజయ కృష్ణ రంగారావు వెనకాడుతున్నారట. నరసరావుపేటలో పోటీ చేయటానికి ప్రత్తిపాటి పుల్లారావు కుదరదని చెప్పేశారట. నెల్లూరు జిల్లాలో అయితే ఏ ఒక్కరూ ఎంపిగా పోటీ చేయటం ఇష్టం లేదని తేల్చిచెప్పేశారట. కనీసం 13 నియోజకవర్గాల్లో ఎంపిలుగా పోటీ చేయటానికి ఇటు సిట్టింగులు వెనకాడి, అటు మంత్రులు ఇష్టపడకపోతే టిడిపి పరిస్దితేంటి ? అన్నదే చంద్రబాబును పట్టి పీడిస్తోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: