Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Oct 15, 2018 | Last Updated 8:35 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : ఒక్కడు చాలు జనసేనను భ్రష్టు పట్టించటానికి

ఎడిటోరియల్ : ఒక్కడు చాలు జనసేనను భ్రష్టు పట్టించటానికి
ఎడిటోరియల్ : ఒక్కడు చాలు జనసేనను భ్రష్టు పట్టించటానికి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నా జనసేన బాలారిష్టాలు దాటలేకపోతోంది. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు తలనొప్పులుగా తయారవుతున్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటే, జనసేన మీడియా కో ఆర్డినేటర్  హరిప్రసాద్ గురించే. ఈ హరిప్రసాద్  ఒకపుడు మీడియాలోనే పనిచేశారట. పవన్ సామాజికవర్గానికే చెందిన వ్యక్తి. వీరిద్దరి ఎలా లింక్ కుదిరిందో సరిగ్గా తెలీటం లేదు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కోటరిలో చాలా ముఖ్యుడైపోయారు. అందుకే మీడియా కో ఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించారు పవన్.


అయితే, సమస్యంతా అక్కడే మొదలైంది. నిజానికి జనసేన పెట్టి సుమారు ఐదేళ్ళుదాటినా ఇంకా బాలారిష్టాలు దాటలేదు. ఆ పార్టీలో పవన్ తప్ప చెప్పుకోవటానికి రెండో నేతే లేరు. అటువంటి సమయంలో పార్టీ వాణిని బలంగా జనాల్లో వినిపించటానికి మీడియానే ప్రధాన మార్గం. పవన్ ఎటూ సెలబ్రిటీనే కాబట్టి మీడియాలో ప్రాధాన్యతకు ఇబ్బందేమీ లేదు. అయితే, మీడియా మ్యానేజ్ మెంట్ లోనే జనసేన బాగా ఇబ్బంది పడుతోంది.

 

పవన్ గురించి మొదట్లో పాజిటివ్ గానే కవరేజీ వచ్చినా తర్వత్తర్వాత తన వ్యవహార శైలితో పవనే మీడియాలో చులకనైపోయారు. అందుకు మీడియా హెడ్ హరిప్రసాద్ కూడా ఒక కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హరిప్రసాద్ అటు మీడియా వ్యక్తి కాక ఇటు పూర్తిస్దాయి రాజకీయ నేత కాకపోవటంతోనే పవన్ కు సమస్యలు పెరిగిపోతున్నాయి. దానికితోడు పవన్ చుట్టూ ఉన్న వారు 24 గంటలూ పవన్ దృష్టిలో పడటానికే తాపత్రయ పడుతుండటం వల్ల వారిలో వారికే ఆధిపత్య గొడవలు పెరిగిపోతున్నాయి. ఇందులో మీడియా హెడ్డే ప్రధానమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


 

ఈయనకు ఏ మీడియా హౌస్ తో కూడా సరైన సంబంధాలు లేవు. పైగా ఎవరైనా మీడియా వాళ్ళు పవన్ తో ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేసినా ఈయన పట్టించుకోవటం లేదు. దాంతో పవన్ తో మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా వెనక్కెళ్ళిపోతున్నారు. ఈమధ్య పవన్ తో ఇంటర్వ్యూ కోసం హిందుస్దాన్ టైమ్స్ నుండి హరిప్రసాద్ ను సంప్రదిస్తే సరైన సమాధానం రాలేదట. అలాగే, చిరంజీవికి అత్యంత సన్నిహితుడు సత్యప్రసాద్ ఫోన్ చేస్తే హరిప్రసాద్ సరిగా  మాట్లాడలేదని సమాచారం. దాంతో ఆయన సోషల్ మీడియా  వేదికగా జనసేన మీడియా హెడ్ ను ఏకిపారేశారట.


నిజానికి  మీడియాను నిర్లక్ష్యం చేసిన వాళ్ళెవరూ నెగ్గుకురాలేదు. మీడియాతో సరైన సంబంధాలు పెట్టుకోకపోతే మహామహులకే ఎదురు దెబ్బలు తప్పలేదు. ఇక పవన్ ఎంత ?  కాకపోతే హరిప్రసాద్ లాంటి వాళ్ళు చేసే తప్పులకు నేరుగా పవన్ మూల్యం చెల్లించాల్సుంటుంది.  పైగా త్వరలో ఎన్నికలు పెట్టుకుని పవన్ ఇటువంటి విషయాల్లో ఉపేక్షిస్తే భాారీగా నష్టపోవాల్సుంటుంది.  ఆ విషయాన్ని పవన్ ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది.


janasena-pawan-kalyan-media-head-hariprasad-poor-r
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టిఆర్ఎస్ నేతపై కెసియార్ వేటు
పవన్ కు పోలీసుల షాక్..చివరి నిముషంలో
ఎడిటోరియల్ : ఇటువంటి వాళ్ళ వల్ల జనసేనకు ఏంటి ఉపయోగం ?
లోకేష్ పై సిబిఐ గురిపెట్టిందా ?
ఎడిటోరియల్ : టిడిపి వైపు చూస్తున్న లేళ్ళ..కుదురుతుందా ?
పవన్ లెక్క తెలంగాణాలో 24..ఏపిలో ?
ఎడిటోరియల్ : రెండు ప్రాంతాలకే జనసేన పరిమితమా ? ఆశలు వదిలేసుకున్నారా ?
ఎడిటోరియల్ : వైసిపి-బిజెపి మధ్య ఒప్పందం జరిగిందా ?
పవన్ లో గందరగోళం..ఏం మాట్లాడుతారో ఎప్పటికీ అర్ధంకారు
మనోహర్ విలువ ఇంతేనా ?
ఎడిటోరియల్ : ఓటుకునోటుకు ఐటి దాడులకు లింకా ?
ఆపరేషన్ గరుడలో భాగమే : లోకేష్ సంచలనం
ఎడిటోరియల్ : జనసేన రహస్య సర్వే..కోటరీకి సంబంధ లేకుండానే
బ్రేకింగ్ న్యూస్ : సిఎం ఇంటిపై  ఐటి దాడులు
ఎడిటోరియల్ : రాహూల్ కు కాంగ్రెస్ నేతల షాక్
జనసేనలోకి నాదెండ్ల
బిజెపిలో చేరిన దామోదర భార్య
ఎడిటోరియల్ : సుజనా పై ఈడీ దాడులు...టిడిపిలో సంచలనం
కెసియార్ కు హైకోర్టు షాక్
రేవంత్ కు కాంగ్రెస్ షాక్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.