పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్ర లో చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా ప్రజలకు  నవ్వు తెప్పిస్తున్నాయని చెప్పాలి. ప్రధానమంత్రి అయ్యే అవకాశం నాకెప్పుడో వచ్చింది కానీ లోకేష్ వద్దంటే వదులుకున్నానని" చంద్రబాబు చెబుతుంటే పడీపడీ నవ్వుకునేవారు జనాలు. పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు అదే టైపు కామెడీ స్టార్ట్ చేశాడు. "నాకు సీఎం పదవి కావాలంటే బీజేపీతో ఎప్పుడో చేతులు కలిపి ముఖ్యమంత్రిని అయ్యేవాడిని. జనసేనను బీజేపీలో కలపమని అమిత్ షా ఎప్పుడో నాకు ఆఫర్ ఇచ్చాడు." ఇది జనసేనాని తాజా డైలాగ్.


చేసిన తప్పుకు భాద పడటం ఎందుకు పవన్... అప్పుడు తెలియదా...!

పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ పవన్ ఏ సందర్భంలో ఎలా ముఖ్యమంత్రి అయ్యేవాడో జనానికి కాస్త వివరిస్తే బాగుండేది. 2014 ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ వస్తే, పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రిని చేస్తానని అమిత్ షా ఎలా హామీ ఇచ్చారో ఆయనకే తెలియాలి. నిజానికి 2014లోనే కాదు, 2019లో కూడా బీజేపీకి ఏపీలో అంత సీన్ లేదు. రాష్ట్రంలో అది ప్రభావవంతమైన పార్టీ కాదు.

చేసిన తప్పుకు భాద పడటం ఎందుకు పవన్... అప్పుడు తెలియదా...!

పోనీ జనసేనకు ఏమైనా క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం ఉండి పాతుకుపోయిన పార్టీనా అంటే అది కూడా కాదు. మరి బీజేపీతో కలిస్తే పవన్ ఎలా సీఎం అవుతారో అర్థంకావడం లేదు. అప్పట్లో అన్న చిరంజీవి ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో కలిపి చారిత్రక తప్పిదం చేశాడని కాబోలు, ఇప్పుడు తమ్ముడు జనసేనని బీజేపీకి అమ్మకానికి పెట్టలేదు. జస్ట్ తాకట్టు పెట్టారంతే. పవన్ కల్యాణ్ అప్పట్లో చంద్రబాబు డైరక్షన్లో పనిచేస్తే, ఇప్పుడు బీజేపీ దర్శకత్వంలో నటిస్తున్నారని చాలామంది నమ్ముతున్నారు. పవన్ మాటలు, చేతలు దీనికి బలం చేకూరుస్తున్నాయి కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: