తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే.  ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మద్య ఉత్కంఠకరమైన పోటీ ఉండబోతుందని అంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.  మరోవైపు ప్రచారం కూడా ఊపందుకుంది.  ఈ నేపథ్యంలో ఇప్పడు బీజేపీ కూడా ప్రచార జోరు పెంచింది.  నేడు తెలంగాణకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వచ్చారు.  ఈ సందర్బంగా ఆయన టీఆర్ఎస్ పై పాలనపై ముఖ్యంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఎదుర్కొనే ధైర్యంలేకనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు.
Image result for telangana
కరీంనగర్‌లో జరిగిన బీజేపీ తొలి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. 2018లో తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు.. వాస్తవానికి 2019 ఏప్రిల్, మేలో జరగాల్సి ఉంది. దేశంలో జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు జరగాల్సిన ఎన్నికలను 6 నెలల ముందుకు తీసుకొచ్చి ఎన్నికలు జరిపించడంలో ఆంతర్యమేంటి? అని ప్రశ్నిస్తున్నాని అన్నారు.  తెలంగాణ అభివృద్ది చేశామని చెబుతున్నా రైతుల ఆక్రందన ఇంకా వినిపిస్తూనే ఉందని..అభివృద్ది పేరు తో ఆ కుటుంబం బాగా అభివృద్ది చెందిందని అన్నారు. 

కేసీఆర్ తన తదనంతరం కొడుకునో, కూతురినో సీఎంని చేస్తారు తప్ప దళితుడ్ని మాత్రం సీఎంని కానివ్వరు అని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు.  కేసీఆర్ గారు గతంలో ‘తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే నేను దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తా’ అని వాగ్దానం చేశారు. కానీ 2014 తర్వాత ఆ వాగ్దానాన్ని ఆయన నిలుపుకోలేదు. తన తదనంతరం కూడా దళితుడ్ని సీఎంని చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదు.

ఈ ఎన్నికలు ముందు జరగడం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలపై అదనపు భారం వందల కోట్లు పడుతోంది. ఈ ప్రాంతంలో ఉండే బీద, బడుగు వర్గాల ప్రజలు అదనపు భారం మోసే ఈ ఎన్నికను ముందే ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నా. అన్ని వాగ్దానాల్లోనూ, అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం విఫలమైందనేది మనందరికీ తెలుసు  అని అమిత్ షా వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: