మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మొహమాటం ఎక్కువ. అదేంటి అనుకుంటున్నారా. అవసరాలను బట్టి మొహమాటాలు అలా పుట్టుకొస్తాయి. అప్పట్లో బీజేపీలో ఉన్నపుడు ఇలాగే మొహమాటానికి పోయి ప్రత్యేక హోదాపై ఏం అనలేకపోయారు. పైగా ప్యాకేజ్ భేష్ అంటూ కమలనాధుల స్క్రిప్ట్ చదువుతూ భలే టైం పాస్ చేశారు. ఇపుడు మళ్ళీ ఆయనకు మొహమాటం వచ్చేసింది. అదేంటో..
.
ఒక్క మాట కూడా :


చంద్రబాబు తాజాగా  అనంతపురం జిల్లా టూర్ చేసారు. అక్కడ మీటింగ్ పెట్టి అటు బీజేపీని, ఇటు జగన్, పవన్ లను తిట్టిన తిట్టు తిట్టకుందా తిట్టేశారు. ముగ్గురూ కుమ్మక్కు రాజకీయాలు అన్నారు. వాళ్ళంతా  అభివ్రుధ్ధి నిరోధకులు అంటూ మాటలు ధాటీగా వాడేశారు. బాగానే ఉంది. మరి ఏపీని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ ని మాత్రం ఒక్క మాట అంటే ఒట్టు. ఆ వూసే లేకుండా జాగ్రత్త పడ్డారు.


ఆచీ తూచీ :


బాబు తన ప్రసంగంలో విభజన గురించి ప్రస్తావించారు. గతంలో అయితే ఇంతెత్తున లేచి కాంగ్రెస్ పై ఎగిరిపడేవారు. అడ్డ గోలు విభజనతో రోడ్డున పడేశారు. ఇటలీ మాఫియా అంటూ గొంతు చించుకునేవారు కూడా. మరి నాలుగు నెలల నుంచి ఆ మాటలు తీరే మారిపోయింది. విభజన వరకు మాట్లాడిన బాబు అన్యాయంగా ఏపీని రెండు ముక్కలు చేశారంటూ అక్కడితో ముగించేశారు. ఎవరో అడ్డుపడినట్లుగా మళ్ళీ ఆ ప్రసక్టి తీసుకురాకుండా నేరుగా బీజేపీపై పడిపోయారు.


నమ్మకద్రోహం :


ఇపుడు బాబు సరికొత్త నినాదం ఇదే. నమ్మక ద్రోహం చేశారు. మాట తప్పారు, అన్నీ చేస్తాం ఏపీకి అంటూ వంచిచారు ఇపుడు ఇలా సాగుతోంది బాబు స్పీచ్. కానీ ఆ పవర్ ఫుల్ డైలాగ్స్ మాత్రం లేకుండా చప్పగా సాగిపోతోంది. కాంగ్రెస్ ని తిడుతున్నపుడు వచ్చిన స్పందన ఇపుడు బాబు బేజేపీని తిడితే రావడం లేదు. దానికి రెండు కారణాలు. ఒకటి ఏపీలో బీజేపీ ఉనికి పెద్దగా లేదు. రెండవది బాబు కావాలని పొత్తు పెట్టుకుని నాలుగేళ్ళు వాళ్ళతో అంటకాగారు. 



అంటే బీజేపీని అంటే ఆ పాపంలో సగం  బాబుకు కూడా వాటా ఉంటుందని జనం నమ్మడం వల్లనే ఈ నమ్మకద్రోహం నినాదం అంతగా పేలడంలేదు. ఏది ఏమైనా బాబు కొత్త నేస్తం కాంగ్రెస్ ని బాగా ముద్దుగా చూసుకుంటున్నారు. ఒక్క మాటా అనడం లేదు. అయినా ఇదెనాళ్ళ ముచ్చట. కొంతకాలం ఆగితే మళ్ళీ వీళ్ళు కూడా బాబు తిట్లకు రెడీగా ఉండాలి, ఎంతైనా ఇది బాబు మార్క్ పాలిట్రిక్స్ కద.


మరింత సమాచారం తెలుసుకోండి: