ఇంతకాలానికి జనసేనలోకి పేరున్న నేత ఒకరు చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ త్వరలో జనసేనలో చేరుతున్నారు. ఈరోజు ఇద్దరి మధ్య భేటీ జరిగింది. ఇద్దరు చాలాసేపు శంషాబాద్ ఎయిర్ పోర్టులో మాట్లాడుకున్నారు. తర్వాత ఒకే విమానంలో తిరుపతికి వెళ్ళారు. పార్టీలో మనోహర్ కు ఏ పదవి ఇస్తారనే విషయంలో స్పష్టత లేకపోయినా వచ్చే ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీకి పోటీ చేయటం మాత్రం ఖాయమైపోయింది.

 

మనోహర్ కు కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధముంది. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కొడుకే మనోహన్ అన్న విషయం అందిరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఏపికి మనోహర్ స్పీకర్ గా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు తెనాలి నుండే గెలిచారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చాలామంది దెబ్బతిన్నట్లే మనోహర్ కూడా దెబ్బతిన్నారు. తర్వాత చాలాకాలం యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. త్వరలో షెడ్యూల్ ఎన్నికలు వస్తున్నాయి కదా ? అందుకే మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు.


యాక్టివ్ అవ్వాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాలి కదా ? కాంగ్రెస్ లో అయితే భవిష్యత్తు లేదన్న విషయం అర్ధమైపోయింది. అందుకే ఆమధ్య వైసిపి నేతలతో కూడా మాట్లాడారు. తర్వాత ఏమైందో ఏమో ? హఠాత్తుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఇపుడు రెండోసారి భేటీ అయిన తర్వాత జనసేనలో చేరటం ఖాయమైపోయింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: