ఈ మద్య జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర ఆర్టీసీ బస్ ప్రమాదంలో 63 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ ప్రమాదాల్లో ఇదే అతి పెద్ద ప్రమాదంగా పేర్కొన్నారు.   తాజాగా  కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నైరోబీ నుంచి కుసుము వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో 50 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రుల ఆర్తనాదాలు, మృతదేహాల శరీర భాగాలతో ప్రమాద స్థలి భీతావహంగా మారింది.

 బస్సులో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నారని, డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా డ్రైవర్‌ ఇష్టానుసారంగా బస్సును నడపటంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్పారు. మృతుల్లో 12 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. వేగంగా దూసుకొచ్చిన బస్సు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
kenya bus crash, at least 50 killed
 బస్సు నాలుగైదు పల్టీలు కొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.  దాంతో లోపల ఉన్న ప్రయాణికులు ఎక్కువగా మరణించారని బాధితులు అంటున్నారు. సదరు బస్సుకు ఎలాంటి లైసెన్సులు లేవని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: