2009 ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారం లో భాగంగా యువ రాజ్యానికి సారధిగా వహిస్తున్న పవన్ కళ్యాణ్ అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పై తీవ్రంగా ఆరోపణలు , విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత వైఎస్ మరణించడం..ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో కలిసిపోవడం..కొంతకాలం పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అన్నయ్య చిరంజీవి కి దూరంగా ఉండటం జరిగాయి. ఇదే క్రమంలో 2014 ఎన్నికల సమయంలో ఆంధ్ర రాష్ట్ర విభజన జరగడం తో పవన్ కళ్యాణ్ తిరిగి పాలిటిక్స్ లోకి రావడం జరిగింది.

Related image

ఆ సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో ఆంధ్రాలో వైసీపీ పార్టీ ఆఖరి క్షణంలో గెలవాల్సిన సమయంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి జగన్ కలలు కంటున్న ముఖ్యమంత్రి పీఠాన్ని రానీయకుండా చేశారు. అంతేకాకుండా ఆ సమయంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో జగన్ పై అలాగే ఆయన తల్లి విజయమ్మ గారిపై ఇష్టానుసారంగా మాట్లాడారు. జగన్ హటావో ఆంధ్ర బచావో అంటూ కొత్త నినాదం ఎత్తుకొని ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు మరియు మోడీతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్.

Image result for jagan pawan

అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇష్టానుసారంగా అవినీతి పాలు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేయడంతో నాలుగు సంవత్సరాలు ప్రశ్నించకుండా పవన్ కళ్యాణ్ సరిగ్గా ఎన్నికలు సంవత్సరం ఉన్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని ప్రకటించి ప్రస్తుతం తన పార్టీ తరపున ప్రజాపోరాట యాత్ర అంటూ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటనను చేస్తున్నారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని వైసీపీ అధినేత జగన్ కి వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి తెలిపారట.

Image result for pawan vijay sai reddy

దీంతో వెంటనే ఆగ్రహంతో విజయసాయి రెడ్డి పై మండిపడ్డారట జగన్. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు ముందు నుంచి తమతో ఎవరు ఉన్నారు అందరికీ తెలుసని..2014 ఎన్నికలలో వైసిపి పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ఎక్కడికీ పోలేదని..ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కూడా ప్రస్తుతం మన వైపే ఉందని..కాబట్టి రానున్న ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకునే అవసరం లేదని..గత ఎన్నికల మాదిరిగానే ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చి చెప్పేశారట జగన్. అంతగా అవసరమైతే చివరిలో చూద్దాం..పవన్ కళ్యాణ్ తో మాత్రం కలిసే ప్రసక్తే లేదని ప్రస్తుతం జగన్ తమ పార్టీ నాయకులతో అన్నట్లు ఏపీ పాలిటిక్స్లో వినబడుతున్న మాట.



మరింత సమాచారం తెలుసుకోండి: