ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ఐటి మంత్రి నారా లోకేష్ ఆలోచనల ప్రకారం ఐటి దాడులు ఏపీపై దాడులైతే మరి తన రాష్ట్రంలోని ఏసీబీ ఉద్యోగులపై చేసే దాడులు ఉద్యోగవర్గాలపై దాడులనాలా?  గత కొన్ని రోజులుగా అధికార పార్టీ నేతలు అందరూ ఐటి దాడులను ఏపీపై దాడిగా చిత్రీకరిస్తున్నారు. అంతే కాదు, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధంగా ఏకంగా ఐటి అధికారులకు పోలీసు భద్రతకు కూడా ఉపసంహరిస్తామని ప్రకటించారు. అంతే కాదు, పెట్టుబడు లను  దెబ్బతీసేందుకే ఐటి దాడులు అంటూ ఒక నూతన వాదనను తెర పైకి తెచ్చారు. 
Image result for it raids & searches in ap
అంటే నేఱం చేయకపోతే, ఐటి దాడులు జరిగితే భయమెందుకు? అలా మొత్తం అధికార పార్టీ ప్రతినిదులంతా వణికిపోవటమెందుకు? అంతే కాదు ఐటి దాడులకు రాష్ట్రానికి తరలివచ్చే పెట్టుబడులకు సంబంధం ఏంటి?  అన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. అంటే రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులన్నీ అనైతికమేనని భావించాలా? రాష్ట్రాన్ని అనైతిక అవినీతి రాష్ట్రమని అనాలా? ఇదేమి చోధ్యం? బాబుకు, చినబాబుకు రాజకీయాలు చేయటమే పనా? రాష్ట్రంలో పాలన అనేది స్థంభించిపోయినా బాధ్యతలేదా?  
Image result for it raids & searches in ap
ఈ లెక్కన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఏపీలో ఏ కంపెనీ దగ్గరైనా, ఏ నేత దగ్గర బ్లాక్ మనీ ఉన్నా, అక్రమార్జన ఉన్నా, మా జోలి కొస్తే ఇలాగే చేస్తామని హెచ్చరిస్తున్నారా? ఇందుకు ఒక సామాజిక వర్గ మీడియాను సృష్టించుకొని దాని ద్వారా సమాజంపై గుండా గిరి చేస్తూ వాడేస్తున్నారా? ఇంతకాలం ఇలాగే ఉపయోగించుకుంటున్నారా? అనే ఉత్పన్నం అయ్యే ప్రశ్నలకు సమాధానం “అవుననే అని అనిపిస్తున్నాయి” పార్టీ ప్రభుత్వ వర్గాల వ్యవహారం చూసిన వాళ్లకి
Image result for it raids & searches in ap
ఇటీవల ఏసీబీ అధికారులు విద్యా శాఖకు చెందిన ఏడీ ప్రభాకర్ రావు పై దాడి చేశారు. ఏకంగా ₹ 82 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. గతంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరే వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించారు. మరి అప్పుడు ఏసీబీ దాడులు ఉద్యోగులపై దాడి అంటే బాబు, లోకేష్ లు వాళ్ళను వదిలేస్తారా? 


గతంలో చాలా మంది ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేసి వందల కోట్ల రూపాయల అక్రమార్జనను గుర్తించింది. పారిశ్రామికవేత్తలపై ఐటి శాఖ అధికారుల దాడులు ఏపీపై జరిగిన దాడులు అయితే, వందల కోట్ల రూపాయల అక్రమార్జన చేసిన అధికారులపై ఏసీబీ దాడులు కూడా తప్పేనా?
Image result for it raids & searches in ap
తన జీవితంలో ఇంతపెద్ద ఎత్తున ఐటీ దాడులు జరగడం ఇదే తొలిసారన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న సంస్థలు, టీడీపీ నేతల లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించటం - నెలల తరబడి జైల్లో కూర్చున్న నేతలు ఐటీ దాడుల గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు లోకేష్. అసలు లోకెష్ ఎంత? ఆయన జీవితం సైజెంత? అనుభవ సారమెంత? ఒక్కసారైనా ప్రజాక్షేత్రంలో ఎన్నికైన దాఖలాలున్నాయా? అలాంటి రాజకీయ సూక్ష్మజీవి ఎవరి మీదనో ఐటీ దాడులు జరిగితే అవి తనపై తన తండ్రిపై తమ పార్టీపై, తమ ప్రభుత్వంపై జరిగిన దాడులుగా పరిగణిస్తే – వారు నిర్ద్వంధంగా నేఱస్తులేనని వ్యక్తిగతంగా అంగీకరించినట్లే. 
Image result for it raids & searches in ap
అంత సుధీర్ఘ అనుభవముండి దేశ ప్రధాని కంటే సమర్ధుణ్ణని చెప్పుకునే  చంద్రబాబునాయుడు ఆఫ్ట్రాల్ తను చేసిన శాననాలను అమలు చేసే చిన ఐటి అధికారులు అంటే ఎందుకు భయపడుతున్నారో? చెప్పాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరిపైనో ఐటీ దాడులు జరిగితే కేబినెట్ సమావేశం పెట్టి చర్చించడ మేమిటి? ఆని జగన్ ప్రశ్నించారు. గతంలో కూడ ఐటీ దాడులు జరిగాయి కదా! అని జగన్ ప్రశ్నించారు. ఎవరిపైనో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగితే చంద్రబాబు కు భయం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. అంటే అవినీతి జరిగిన ప్రతి చోటా నేపధ్యంలో ఉన్నది తనేననే కదా! అర్ధం.
Image result for it raids & searches in ap
ఈ ఐటీ దాడుల వల్ల తాను దోచుకొన్న నాలుగు లక్షల కోట్లు బయటపడుతాయనే భయం పట్టుకొందన్నారు.  ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో కోట్లాది రూపాయాలను చేర్చారని చెప్పారు.ఈ డబ్బుల తోనే వచ్చే ఎన్నికల్లో  ఓటుకు రూ.3 వేల చొప్పున  కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని  జగన్ ఆరోపించారు.
Image result for it raids & searches in ap
గతంలో తనపై కుట్రపూరితంగా సీబీఐ దాడులు జరిగితే, ఆ దాడుల విషయం కన్పించలేదా? అని జగన్ చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. ఆదాయపు పన్నుశాఖ అధికారుల దాడులను రాష్ట్రంపై  యుద్దంగా చిత్రీకరించేందకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారంటే ప్రతి చోటా ఆయన ఇన్వాల్వ్ అయినట్లేనా అని జగన్ జగన్ సభలకు వచ్చిన వారు విమర్శిస్తున్నారు. 


రాష్ట్రంలో ఇంత జరుగుతోంటే బాబు గారి సామాజిక వర్గ మీడియా ఒక కూటమిగా మారి బాబుకు కొమ్ముకాస్తోందని జగన్ తో పాటు సభికులంతా విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నాలంచాలు ఇవ్వాల్సిందేనని ఇసుక, మద్యం, భూములు, గనులు, కల్తీ, ఎర్రచందనం ఇలా ప్రతి చోటా జరిగే అన్నింట్లో జరిగే దోపీడీలో పార్టీ ప్రభుత్వ పేద్దల ప్రమేయముందనే ఇప్పుడు జనాభిప్రాయం.
Image result for it raids & searches in ap
ఏపీలో జరిగిన ఐటీ దాడులపై సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆదివారం హైదారాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ దాడులు జరిగితే ప్రజలకు నష్టమా? లేక టీడీపీ నాయకులకా? అన్నారు.  దర్యాప్తు సంస్థలంటే, నిప్పులాంటి మనిషినని చెప్పుకునే బాబు ఎందుకు వణికిపోతున్నారు? కట్టలకొద్దీ డబ్బులు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలను కొన్నారు. ఈ డబ్బంతా ఎక్కడినుంచి వచ్చింది? బాబు బినామీల దగ్గర ఇది ఉంది. అంతా బయటికి తీయాలని  ఐటీశాఖను కోరుతున్నాను అని రాంబాబు అన్నారు. 


అన్ని రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే ఎన్నికల ఖర్చు అధికమని, ఇందుకు కారణం చంద్రబాబేనని, ప్రతి నియోజక వర్గానికీ ₹ 20 కోట్లు సిద్ధంగా ఉంచామని లోకేష్ గతంలో పవన్ కళ్యాణ్ తో చెప్పలేదా అని ఆయన పేర్కొన్నారు. ఆర్ధిక నేరస్తులను పార్టీలోకి తీసుకుని డబ్బు వెదజల్లుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఏపీలో ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల గురించి టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయన్నారు ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు.
Image result for it raids & searches in ap
రెగ్యులర్ గా జరిగే ఐటీ దాడులను బూచీగా చూపి అక్రమ సంపాదనను రక్షించుకునేందుకు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ఐటీ సోదాలను భూతద్ధంలో చూపించి చేస్తున్న రాద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ఎవరికెలా బుద్ధిచెప్పాలో చెబుతారని ఆయన అన్నారు.

విజయవాడ పరిధిలోని సదరన్ డెవలపర్స్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న సోదాల్లో భాగంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. సదరన్ కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రికి సంబంధించిన లావాదేవీల డాక్యుమెంట్లను అధికారులు కనిపెట్టి, వాటిని తమ అధీనంలోకి తీసుకున్నారని సమాచారం.సదరన్ డెవలపర్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో అమరావతిలో భూ లావాదేవీలు జరిపినట్లు ఐటీ గుర్తించింది.
 
సదరు మంత్రి ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో భూముల లావాదేవీలను జరుపగా, వాటన్నింటిపైనా ముందునుంచే నిఘా పెట్టిన ఐటీ అధికారులు, ఈ సోదాల్లో వాటి ని గుర్తించిందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఐటీ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.


మూర్తిగారు తన అంత్యక్రియలకు కూడా తగినంత భూమి మిగుల్చుకోలేదా? అయ్యో పాపం!


అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన గీతమ్స్ విద్యాసంస్థల అధినేత, తెలుగుదేశం ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియల కోసం ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయించడం విమర్శల పాలవుతోంది. సాధారణంగా మరణం విషయంలో, మరణించిన వారి విషయంలో విమర్శలు చేయడానికి ఎవరైనా వెనుకాడతారు. అయితే ఏపీ ప్రభుత్వ తీరు మాత్రం గీతమ్ మూర్తి అంత్యక్రియలను కూడా విమర్శలకు తావిచ్చేలా చేస్తోంది.



గీతమ్స్ అధినేత ఏమీ బికారి కాదు. ఆయన వందల కోట్ల రూపాయలకు అధిపతి. మాజీ ఎంపీ. ప్రస్తుత తెలుగుదేశం అధినేత కు బంధువు. బాలకృష్ణ వియ్యంకుడికి కన్న తండ్రి.  ఇంత గొప్ప నేపథ్యం ఉంది. విశాఖతో సహా హైదరాబాద్, బెంగళూరుల్లో గీతమ్ విద్యాసంస్థలు కొన్ని వందల ఎకరాల్లో విస్తరించాయి. అలాంటి అపార వ్యాపార శక్తి అంత్యక్రియలను ప్రభుత్వ భూమిలో చేపట్టారు. అది కూడా ఆయన మరణించిన తర్వాత అప్పటికిప్పుడు భూమిని కేటాయించి, అంత్యక్రియలను నిర్వహించారు.



చంద్రబాబుకు బంధువు కాబట్టి, అప్పటికప్పుడు భూకేటాయింపులు ఆపై సంతర్పణలు జరిగిపోయాయి. ఇదీ కథ. కొన్ని వందల ఎకరాల భూమి లో విద్యా వ్యాపారాన్ని చేసుకుంటున్న మూర్తి అంత్యక్రియలను ఆయన సొంత భూముల్లో నిర్వహించ లేదు. ప్రభుత్వ భూమి కావాల్సి వచ్చింది. ఈ విషయంలో అటు మూర్తి కుటుంబం, చంద్రబాబు ప్రభుత్వం రెండూ విమర్శల పాలవుతున్నాయి. అధికారం ఉంది కాబట్టి, ఇలా అయినవారి అంత్యక్రియలకు కూడా ప్రభుత్వ భూములను కేటాయిస్తు న్నారు. ఇదీ చంద్రబాబు ప్రభుత్వ తీరు. ఈ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రజల సంపదకు ట్రస్టీలు మాత్రమే గాని  యజమానులు కాదు. ఇంతగా ప్రజా నమ్మకాన్ని వమ్ముచేసిన నేత ప్రపంచంలో ఇంకొకరు ఉన్నారంటారా? 

మరింత సమాచారం తెలుసుకోండి: