నాలుగేళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు  అక్టోబర్  12న విశాఖను హుదూద్ తుపాన్ భయంకరంగా విరుచుకుపడింది. సుందర నగరాన్ని చిందర వందర చేసి పెను విళయాన్నే స్రుష్టించింది.సరిగ్గా అదే తేదీల్లో ఇపుడు శ్రీకాకుళం జిల్లాపై పగ పట్టినట్లుగా దూసుకువచ్చిన తిత్లీ తుపాను పచ్చని ప్రక్రుతి గుండెల్లో నిలువెల్లా కోత కోసి వెళ్ళింది. పలాసా జీడితోటలు, ఉద్దానం కొబ్బరి తోటలు ఇకపై కొన్నాళ్ళా పాటు పుస్తకాల్లొనే చదువుకోవాలి.


కొబ్బరిపై కొరివి:


ఉద్దానం అంటే కిడ్నీ వ్యాధులుగా ఇపుడు జనాలకు తెలుస్తోంది కానీ అసలు ఉద్దానం అంటే కొబ్బరి తోటలలు నిలయంగా ప్రసిద్ధి గాంచింది. అక్కడ పచ్హగా కొబ్బరి ఆకులతో ప్రక్రుతి పరవశించిన ద్రుశ్యాలు కడు రమణీయాలు. పర్యాటక ప్రాంతంగా కూడా జనాలు ఉద్దానం గురించి చెప్పుకుంటారు. ఇక్కడ జనాలకు బువ్వ పెట్టేది కొబ్బారి చెట్లే. చెట్టంత కొడుకులను ఇక్కడ జనాలు ఎపుడూ నమ్ముకోలేదు. కొబ్బరి తోటలే కుటుంబాలన్నింటికీ జీవనాధారం. తిత్లీ తుపాన్ దెబ్బకు మరో పదేళ్ళ వరకు కొబ్బరి తోటల వైపు చూడనక్కరలేదని చెబుతున్నారంటే ఆ విషాదం మాటలకు అందనిదే.


జీడి తోటలు విద్వంసం  :


మరో వైపు జీడి తోటల పంటలు కూడా నూటికి నూరు శాతం సర్వనాశనం అయ్యాయి. జీడి రైతులు వాటిని చూసుకుని ధీమాగా బతుకు వెళ్ళదీసేవారు. పలాసా జీడిపప్పు ఎంతో ప్రసిధ్ధి. అటువంటిది తిత్లీ తుపాన్ బీభత్సానికి పలసా, ఉద్దానం సహా నాలుగు మండలాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. దీంతో అన్నం పెట్టే జీడి తోటలు నేలకొరిగి రైతుల వేదన వర్ణనాతీతంగా ఉంది. అన్న దాతల కళ్ళలో సుడులను చూసిన వారికి అర్ధమవుతుంది తిత్లీ చేసిన గాయమేంటో.


ఆదుకోవాలంటున్న అన్న దాతలు :


తితిలీ తుఫాన్ ఉద్దానంపై తీవ్ర ప్రభావం చూపింది.దాదాపు నాలుగుమండలాల్లో ఆకలి కేకలు వినిపించేలా చేసింది. ఇక్క్డ ఉన్న  ప్రతి ఇంటికి నష్టం జరిగింది. కొబ్బరి తోటలు వందకు వందశాతం నేలకొరిగాయి.  జీడిమామిడి చెట్లు  ఎందుకూ పనికిరాకుండా పోయాయి. జీడి పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం చూపించేలా తుపాను తాకిడి ఉంది. ఇక, వచ్చే పదేళ్లు కొబ్బరి, జీడి సంపాదన ఉండదు, మాకు ఎలాంటి బతుకు భరోసా ఇవ్వదంటూ ఇక్కడ అన్న దాతలు కంట కనీరు పెడుతున్నారంటే ఎవరికైన మనసు కరగక మానదు. 



బతుకు వెళ్లదీయడం ఎలా అనే ప్రశ్న ఇవాళ ఉద్దానం ప్రజల్లో వచ్చిందంటే నిజంగా ఆ పరిస్తితి అర్థం చేసుకోవచ్చు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలంతా ముందుకు రావాలి. మళ్ళీ మన ఉద్దానాన్ని తిరిగి నిర్మించుకుందాం. మళ్ళీ కొబ్బరి ఆకుల గలలు విందాం. జీడి మామిది పూతను చిగురింపచేదాం. అంతా కలసి కదలి వస్తేనే అన్న దాతల శోకం వీడుతుంది. వారు కోరుతున్నదీ అదే.



మరింత సమాచారం తెలుసుకోండి: