తెలంగాణ రాజకీయాల్లో నాగం జనార్థన్ రెడ్డి అంటె తెలియని వారు ఉండరు.  ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలో ఉండగా నాగం జనార్థన్ రెడ్డి ముఖ్యభూమిక పోషించారు.  ఇక తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో టీడీపితో విభేదించారు.  తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీలోకి వెళ్లారు.  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.  తాజాగా నాగం జనార్థన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.  నాగం తనయుడు దినకర్ రెడ్డి(46) అనారోగ్యంతో కన్నుమూశారు.

గత కొంతకాలం నుంచి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా సతమతమవుతున్న దినకర్ రెడ్డి అక్టోబర్ 4న జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న దినకర్ రెడ్డి గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.  . కుమారుడి మరణంతో నాగం జనార్ధన్ రెడ్డి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. దినకర్ మరణవార్త తెలుసుకున్న బంధువులు, స్నేహితులు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. 

తండ్రిబాటలోనే తనయుడి పయణం.. 2014 ఎన్నికల్లో నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీ తరపున మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయగా... ఆయన తనయుడు దినకర్ రెడ్డి బీజేపీ తరపున నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే తనయుడు రాజకీయాల్లో రాణిస్తే..తాను రాజకీయాల నుంచి పక్కకు తొలగిపోలని భావించిన నాగం జనార్థన్ తనయుడు    మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు.



మరింత సమాచారం తెలుసుకోండి: