వైఎస్ జగన్. ఆయనల్లో పట్టుదల, అంకితభావం మెండు. ఓ పని చేయాలనుకుంటే అది వజ్ర  సంకల్పమే. ఇపుడు జరుగుతున్న వేలాది కిలోమీటర్ల  పాదయాత్ర అలానే చూడాలి. ఎండలు, వానలు, కొండలు, కోనలు ఆయన గమనాన్ని ఆపలేకపోయాయి. జగన్ పట్ల జనంలోనూ విశేష ఆదరణ కనిపిస్తోంది. నిజానికి 2014లోనూ ఇదే రకమైన అభిమానం జనం చూపించారు. కానీ ఆ అభిమానం ఓట్లుగా మారాలి, అంటే అలా మార్చుకోవాల్సింది వైసీపీనే.


లక్ష్యం  గొప్పదే :


నిజానికి జగన్ ఉమ్మడి ఏపీకే సీఎం కావాల్సిన నాయకుడు. కాంగ్రెస్ తో విభేదించి బయటకు రావడంతో మొత్తం సీన్ రివర్స్ అయింది. ఎక్కవలసిన సీఎం కుర్చీ పదేళ్ళుగా లేట్ అవుతూనే ఉంది. సరే 2019లో అవకాశాలు బాగా ఉన్నాయని వైసీపీ భావిస్తోంది. జగన్ సైతం తాను విడిపోయిన ఏపీకి సీఎం అవుతానని గట్టి ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఓ లక్ష్యాన్ని పెట్టుకుని ఆయన జనంలో కలియ తిరుగుతున్నారు.


వాస్తవం చూడొద్దా :


జగన్ కు రేపటి ఎన్నికలు పూల పానుపు కానే కాదు. జనం మద్దతు ఎంత ఉన్నా ఎన్నికల నిర్వహణ బాగా తెలిసి ఉండాలి పోలింగ్ బూత్ లో పడే ఓటే లెక్కలోకి వస్తుంది తప్ప లక్షల్లో వచ్చిన జనం సంకేతం కానే కాదు. అలా వచ్చిన జనాన్ని ఒడుపుగా బూత్ వరకూ నడిపించే మేనేజ్మెంట్ వైసీపీకి ఉందా అన్నదే ప్రశ్న. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో కూడా జగన్ పార్టీకి జనం ఓటేద్దామనుకున్నా చాలా మంది వేయలేకపోయారని ప్రచారం జరిగింది.


గండర గండడు :


అటు వైపు ఉన్నది గండర గండడు చంద్రబాబునాయుడు. అనేక యుధ్ధాల్లో ఆరితేరిన యోధానుయోధుడు. చివరి నిముషంలో ప్రతికూలతలను  సైతం తనకు అనుకూలంగా మార్చుకోగల  సమర్ధుడు.  మరి బాబు అనుభవం అలా కొండంత ఉంటే జగన్ మాత్రం జనాలే గెలిపిస్తారన్న ఓవర్ కాంఫిడెన్స్ లో ఉండడం మేలు కంటే చేటే చేస్తుంది. అది ఆయన గ్రహించకపోవడమే విచిత్రం.


ఆ స్టేట్మెంట్ తో అతి :


జగన్ విజయనగరం జిల్ల గజపతినగరంలో జరిగిన మీటింగులో మాట్లాడుతూ తాను 30 ఏళ్ళ పాటు ఏపీకి సీఎం గా ఉంటానని చెప్పుకున్నారు. ఆశ మంచిదే కానీ అత్యాశ కారాదు. ఇక్కడ జనం తీర్పు కీలకపమైనది అని అంతా తెలుసుకోవాలి. ప్రజలకు సేవ చేద్దామనే అంతా రాజకీయాల్లోకి వస్తారు. ఉన్నతమైన ఆ పీఠాన్ని అధిరోహించాలని ఉబలాటమూ ఉంటుంది. జీవితంలో ఓకసారి చాన్స్ దొరకడమే గగనం. 



అలాంటిది 30 ఏళ్ళు అంటే ఆరు టెర్మ్ లు. జగన్ గోల్ మరీ పెద్దదిగా కనిపిస్తోంది కదూ. జనం మద్దతు ఉంటే అసాధ్యం కాదు కానీ ఇపుడున్న స్తితిలో ఓవర్ కాంఫిడెన్స్ గానే దాన్ని  చూడాలి. ముందు రేపటి ఎన్నికల్లో విజయం కోసం శ్రమిస్తే ఆ మీదట పాలన చూసి జనం ఇచ్చే తీర్పుతో జగన్ ఆశలు నెరవేరనూ వచ్చు. అందువల్ల కాగల కార్యం  ముందు చూడాలి జగన్ సారూ.


మరింత సమాచారం తెలుసుకోండి: