ఇప్పడూ ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికే అన్ని సర్వేలు తేల్చేశాయి. ఒక పక్క జగన్ ప్రభంజనం చూస్తూనే ఉన్నాము దానికి తోడు పవన్ టీడీపీ మీద విరుచుకుపడుతున్నాడు. ఈ రెండు పార్టీలు కలిస్తే టీడీపీ నేలమట్టం అవడం తధ్యం ఆ విషయం చంద్ర బాబు కు తెలుసు అయితే లోకేష్ బాబు కు మాట్లాడటం చేత కాదు కాదు కాబట్టి ఇంకొక విధంగా మాట్లాడతున్నాడు. 

Image result for lokesh

ఏపీలో వైసీపీ, జనసేన అధ్యక్షులు జగన్‌, పవన్‌ కల్యాణ్‌ చేతులు కలిపితే తెలుగుదేశం ప్రభంజనం వీస్తుందని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఆ ఇద్దరూ కలిస్తే తెలుగుదేశం నెత్తిన పాలుపోసిన వారవుతారని, తెలుగుదేశం పార్టీ 150 సీట్ల వరకు గెలుచుకుంటుందని తెలిపారు. జగన్‌, పవన్‌.. బీజేపీతో కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం 174 సీట్లలో విజయం సాధిస్తుంది. ఒక్క పులివెందుల విషయంలోనే కొంచెం డౌట్‌’ అని చమత్కరించారు. అయితే లోకేష్ చెప్పింది నిజమే అనుకోవచ్చు ఆ 174సీట్లు జగన్ కు , పవన్ కు వచ్చి ఆ ఒక సీటు టీడీపీ కి వచ్చిన ఆశ్చర్యం లేదు. 

Image result for lokesh

రాజకీయాల్లో అవసరార్థం కలిసేవారిని జనం ఆదరించరని చెప్పారు. వన్‌ ప్లస్‌ వన్‌ అంటే టు అనేది రాజకీయాలకు వర్తించదని అభిప్రాయపడ్డారు. జగన్‌ నేతృత్వంలో ప్రతిపక్షం అనేది అర్థం కోల్పోయిందని, ఆయన మాట్లాడే మాటలకు విలువ లేకుండా పోయిందని చెప్పారు. మాట్లాడితే అవినీతి ఆరోపణలు చేస్తారు. 108లో అవినీతి అన్నారు, ఐటీలో అవినీతి అన్నారు. నాపైనా అవినీతి ఆరోపణలు చేశారు. ఒక్క కాగితమైనా చూపించగలిగారా? రుజువు చేయమని అడిగీ అడిగీ ఓపిక నశించింది అంటూ మండిప‌డ్డారు లోకేష్. జగన్‌ వారానికి రెండు మూడురోజులు హైదరాబాద్‌లో క్యాంప్‌ వేస్తారని ఎద్దేవా చేశారు. అయితే లోకేష్ చెప్పిండది నిజమే. 




మరింత సమాచారం తెలుసుకోండి: