అవుల్ పకీర్ జైనుల్బదీన్ అబ్దుల్ కలాం రామేశ్వరం, రామనాథపురం జిల్లా, తమిళనాడు రాష్ట్రంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించాడు.  చిన్ననాటి నుంచి ఆయన ఎంతో పేదరికం అనుభవించారు.   తండ్రి జైనుల్బదీన్, పడవ యజమాని  తల్లి ఆశిఅమ్మ, గృహిణి. పేద కుటుంబ కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా తోడ్పడటానికి వార్తాపత్రికలు పంపిణీ చేశాడు. 

1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు.  కలాం సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన స్కాలర్షిప్ ఎత్తివేస్తాను అని బెదిరించాడు. 
ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ ను ఆకట్టుకున్నాడు.   ఆయన ప్రోత్సాహంతో ఉన్నత విద్యవైపు అడుగులు వేయడం మొదలు పెట్టారు.   మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT – చెన్నై) నుండి పట్టా పొందిన తరువాత 1960 లో, కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు.

కలాం భారత సైన్యం కోసం ఒక చిnన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు, కానీ DRDO లో ఉద్యోగం చేయడంతొ ఆయన సంతృప్తి చెందలేదు.   కలాం ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ కింద ఇస్రో కమిటీలో పనిచేశారు. 1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేరి ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ప్రయోగానికి డైరెక్టర్ గా పనిచేశారు. జూలై 1980 లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్య లో విజయవంతంగా చేర్చినది. 


మరింత సమాచారం తెలుసుకోండి: