మహిళలపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న లైంగిక అత్యాచారాలు ఒకటొక్కటిగా నేడు బయటపడటం అనేక ప్రముఖుల కామకలాపాలకు మహిళలు బలవటమో, అవమానం పాలవటమో, నరకయాతన అనుభవించటమో జరుగుతుండటం సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో మహిళలు సినిమా రంగమనో మరో రంగమనో కాదు అన్నీ రంగాలు ఈ వ్యాధిగ్రస్తులున్నారు. ఒక కేంద్ర మంత్రి ప్రముఖ పాత్రికేయుడు ప్రపంచ వ్యాప్తంగా పేరున్న సంపాదకుడు ఎంజె అక్బర్ కూడా ఉన్నారు ఇప్పుడిప్పుడే మహిళలు ఉవ్వెత్తున వారుపడ్డ వేదనను మీ-టూ అంటూ ఉద్యమం లాగా కొనసాగుతుంది.      


మహిళా జర్నలిస్ట్స్ Vs ఎంజే అక్బర్

Image result for M J Akbar & women harassed by him

కేంద్ర మంత్రి అక్బర్ పై ఆరోపణలు పెచ్చుమీరుతున్నాయి. దేశంలో ప్రస్తుతం  చెలరేగుతున్న ‘మీ టూ’ ఉద్యమానికి ఆయన బారిన పడిన మహిళా ఉద్యోగులు గళం విప్పారు. దీనిపై నోరు మెదపని బీజేపీ నేతలు, ఆయన చేత రాజీనామా చేయించడమే పరిష్కారంగా భావిస్తున్నాయి.


ఎంజే అక్బర్ అందరికీ సుపరిచితుడైన పేరు. ఈయన వ్యక్తిగతంగా చాలా మంది తెలుసు. జర్నలిస్టుగా పనిచేసిన వ్యాసాలు దక్కన్ క్రానికల్లో వచ్చేవి. వాటిని తెలుగులో అనువాదం చేసుకొని పత్రికలు అచ్చు వేయించుకునేవారు. అక్బర్ బీజేపీ ప్రభుత్వంలో సహాయ కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. అంతకు ముందు డెక్కన్ క్రానికల్ పత్రిక లో పనిచేసేవారు. ఆయన ఎప్పుడు బీజేపీని పొగుడుతూ వ్యాసాలు రాయలేదు. అలాగని వ్యతిరేకంగానూ లేవు.


కేంద్ర మంత్రి అయిన తరువాత అక్బర్ పత్రికల్లో వ్యాసాలు రాయడం చాలా వరకు మానేశారు. ఇప్పుడు ఆయనపై వస్తున్న ఆరోపణలు ఇప్పటివి కావు. డీసీలో పనిచేస్తున్నప్పటివే. ఆయన దగ్డరకు వచ్చిన మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించేవారట. అసభ్యంగా మాట్లడటం, చేష్టలు చేయడం, లో దుస్తుల్లో చేతులు పెట్టడం లాంటివి చేసేవారని ఒక్కొక్క విషయాన్ని బయటకు పెడుతున్నారు.అంతేగాక, అక్బర్ పంజాబ్ నుంచి అందమైన అమ్మాయిలను తీసుకువచ్చి, అవసరమైన వారి దగ్గరకు పంపుతూ ఉండేవాడని కూడా కొంత మంది ఉద్యోగులు వెల్లడిస్తున్నారు.


ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా, అక్బర్ మాత్రం స్పందించడంలేదు. బీజేపీ అధిష్ఠానం ఈ విషయమై బహిరంగంగా మాట్లాడకపోయినా, తీవ్ర చర్చ జరుగుతు న్నట్లు తెలుస్తోంది. ఇది మరింత తీవ్రమయ్యేలోగా నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని భావిస్తుందట. అందులో భాగంగా ఆయన పదవికి రాజీనామా చేయించాలని అనుకుంటున్నట్టు భోగట్టా.


చిన్మయి శ్రీపాద Vs వైరముత్తు 

Image result for chinmayi sripada Vs vairamuttu

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా పేరున్న చిన్మయి శ్రీపాద మీ టూ ఉద్యమాన్ని కొత్త లెవెల్ కు తీసుకెళుతోంది. ఒకపక్క బాలీవుడ్ లో లైంగిక వేధింపుల ఆరోపణలు రోజుకో మలుపు తిరుగుతుండగానే సౌత్ లో కూడా దాని తాలూకు ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ విషయంలో గాయని చిన్మయి ముందుండటం ఆశ్చర్య పరిచే విషయం. తాజాగా కోలీవుడ్ సుప్రసిద్ధ గీత రచయిత పద్మ భూషణ్ అవార్డు గ్రహీత వైరముత్తుని ఇందులోకి లాగడంతో ఇది కొత్త మలుపులు తిరుగుతోంది.


ఒకసారి స్విట్జర్ ల్యాండ్ కు మ్యూజికల్ టూర్ కోసం వెళ్ళినప్పుడు వైరముత్తు తనతో చాలా అసభ్యకర రీతిలో ప్రవర్తించేందుకు ప్రయత్నించాడని అతనో కామ రోగి అంటూ చిన్మయి ట్వీట్ చేయడం చాలా దూరం వెళ్లేలా ఉంది. అంతే కాదు తెలుగులో గాయకుడిగా సంగీత దర్శకుడిగా మంచి పేరున్న రఘు దీక్షిత్ గురించి కూడా చిన్మయి ఆరోపణలు చేయడం వ్యవహారాన్ని ఇంకాస్త ముదిరేలా చేస్తోంది. 


ఆన్ లైన్ లో చిన్మయికి మద్దతు భారీగా దక్కుతోంది. సిద్దార్థ్, సమంతా, వరలక్ష్మి శరత్ కుమార్ తనకు అండగా నిలబడుతున్నారు. చిన్మయి భర్త నటుడు కం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దీన్ని ఊరికే వదిలేది లేదు అంటున్నాడు. ఇటీవలే చిలాసౌతో డైరెక్టర్ గా డెబ్యూతోనే సక్సెస్ అందుకున్నాడితను. ఇప్పుడు చిన్మయి వరస చూస్తుంటే ఇంకొన్ని సంచలనమైన పేర్లు బయటికి చెప్పేలా ఉంది.

Image result for nana patekar Vs tanu sri

మరోవైపు నానా పాటేకర్ కు మద్దతుగా వర్మ చేసిన ఓ వీడియో ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. మీ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపకూడదని సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపు అనే పదం వినిపించనంత గట్టిగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు పరిశ్రమ పెద్దలు. తనుశ్రీ దత్తా, కంగనా రౌనత్, అమైరా దస్తూర్ ఇలా ఒక్కొక్కరుగా సినిమా మృగాళ్లు తమ మీద జరిపిన దుశ్చర్యలను బయటపెడుతున్నారు. రానున్న రోజుల్లో ఇది ఇంకా కొత్త మలుపులు తిరిగేలా ఉంది


అమైరా దస్తూర్ Vs  సౌత్ లో ప్రముఖ హీరో

Image result for amyra dastur

బాలీవుడ్ మొత్తం మీటూ ప్రకంపనల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది. రోజుకు కనీసం ఐదు నుంచి పది దాకా బాధితులు బయటికి వచ్చి తాము ఎవరెవరి చేత బాధింప బడ్డామో వంతుల వారీగా పేర్లు బయటపెడుతూ ఉండటంతో  ఇది రోజుకో మలుపు తిరుగుతోంది. అమిర్ ఖాన్ ఇప్పటికే దీనికి మద్దతు తెలుపుతూ గుల్షన్ కుమార్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మొఘల్ నిర్మాణం నుంచి బయటికి రావడమే కాదు  దాని దర్శకుడు సుభాష్ కపూర్ అందులో నుంచి తాత్కాలికంగా బయటికి రావడానికి కారణం అయ్యాడు.


ఇక అక్షయ్ కుమార్ సైతం దర్శకుడు సాజిద్ ఖాన్ మీద వచ్చిన ఆరోపణల్లో నిజం తేలేంత వరకు హౌస్ ఫుల్ 4 షూటింగ్ ఆపేయమని ఇప్పటికే తాకీదు జారీ చేసాడు. ఇందులో పూజా హెగ్డే కూడా నటిస్తోంది. ఇక సుప్రసిద్ధ దర్శక నిర్మాత సుభాష్ ఘాయ్ కు కూడా ఈ మీ టూ సెగ తాకింది. తనుశ్రీ దత్తా నానా పాటేకర్ మీద మొదలు పెట్టిన ఈ మీటూ ఉద్యమం ఎక్కడికో వెళ్ళిపోతోంది. 


బాలీవుడ్ ప్రముఖులు మాత్రం ఇది గాలిబుడగ కారాదని కోరుకుంటున్నారు. నిందితులకు శిక్ష పడే దాకా పోరాడి దీని అంతు తేల్చాలని అప్పటిదాకా లైంగిక వేధింపులు ఆగవని చెబుతున్నారు. ఇది మెల్లగా సౌత్ వైపు వస్తోంది. గాయని - కం- డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి  ఈ విషయంలో ముందంజలో ఉండగా సమంతా లాంటి వాళ్ళు మద్దతు పలుకుతున్నారు. కొద్దిరోజుల్లో ఇక్కడ కూడా పెద్ద పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉంది.


మనసుకు నచ్చింది రాజుగాడు హీరోయిన్ అమైరా దస్తూర్ సౌత్ లో ఒక ప్రముఖ హీరో తనను వేధించాడని త్వరలోనే పేరు బయటపెడతానని గట్టిగానే చెప్పింది.

Image result for amaira Vs dhanush


అమైరా దస్తూర్ సౌత్ లో రాజ్ తరుణ్ - రాజుగాడు సినిమాలో చేసింది. అలాగే సందీప్ కిషన్ మనసుకు నచ్చింది సినిమాతో పాటు కోలీవుడ్ లో ధనుష్ హీరోగా తెరకెక్కిన 'అనేగన్' ( తెలుగులో అనేకుడు) సినిమాలో కూడా నటించింది. అయితే వీరిలో బాగా పలుకుబడి ఉన్న స్టార్ హీరో ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో ధనుష్. దీంతో నెటిజన్స్ అమైరా స్టేట్మెంట్ పై భిన్నభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.


చూస్తుంటే ఈ మీటూ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పెద్ద పెద్ద పేర్లతో పాటు ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనల్లో అలోక్ నాథ్ లాంటి సీనియర్ నటులను ఇందులో లాగడం చూస్తే బాలీవుడ్ లో బిగ్గెస్ట్ సెన్సేషన్ గా ఈ మీ టూ ఉద్యమం నిలిచేలా ఉంది. కాకపోతే తేలుకుట్టిన దొంగల్లా కొందరు సైలెంట్ గా ఉండటం కొత్త అనుమానాలు తెచ్చి పెడుతోంది. 


మలింగ Vs ఎయిర్ హోస్టెస్

Image result for malinga & a air hostess

ప్రపంచ వ్యాప్తంగా కుదిపేస్తున్న మీ టూ మూవ్‌మెంట్ తాాజాగా మరో శ్రీలంక క్రికెటర్‌పై వచ్చింది. వారం క్రితం రణతుంగపై ఓ ఎయిర్‌హోస్టస్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో ఐపిఎల్ జరుగుతున్న సమయంలో అనుకోని పరిస్థితులు మలింగ రూం లోకి వెళ్లే విధంగా జరిగిందని వాపోయింది. దాంతో మలింగ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని, తాను ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయానని ఆమె తెలిపారు.


ఇటీవల టాలీవుడ్ సింగర్ చిన్మయ మీటూ అంటూ వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే..దీంతో ట్విట్టర్ ద్వారా చిన్మయకి సదరు బాధితురాలు తన అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఆ విషయాన్ని చిన్మయ మరో ట్వీట్‌తో ఇవాళ బయటపెట్టింది. 

Image result for subhash kapoor geetika tyagi

మొన్నటికి మొన్న `సూపర్ 30` టీమ్ వికాస్ బాల్ ఉద్వాసనకు సిద్ధమైంది. హృతిక్ అంతటివాడే తాను తప్పు చేసినవారికి సపోర్ట్ చేయలేనని వ్యాఖ్యానించాడు. అంతకు ముందు పాంథమ్ కంపెనీ సైతం వికాస్ బాల్ తో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది. ఈ వరుసలో మరో బిగ్ బికెట్ సుభాష్ కపూర్. ప్రస్తుతం సుభాష్ కపూర్ పై గీతిక త్యాగి అనే నటీమణి తీవ్ర ఆరోపణలు చేయడంతో ప్రొడ్యూసర్ గిల్డ్ విచారణకు ఆదేశించింది. దీంతో పోలీస్ విచారణ ప్రొసీడింగ్స్ కి రంగం సిద్దమైంది. ఆ క్రమంలోనే మిస్టర్ పెర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ సుభాష్ కపూర్ తెరకెక్కించనున్న `మొఘల్` చిత్రం నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. ఆరోపణల నేపథ్యంలో ఈ చిత్రం నుంచి తాము కూడా తప్పుకుంటున్నామని టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ వెల్లడించారు.


ఈ రెండు పరిణామాలతో ఇన్నాళ్లు సుభాష్ని వెనకేసుకొచ్చిన బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తాకపూర్ సైతం మనసు మార్చుకుని తొందర్లోనే తాము నిర్మించనున్న వెబ్ సిరీస్ నుంచి సుభాష్ని డిస్మిస్ చేస్తున్నామని ప్రకటించింది. సుభాష్ పై విచారణ పూర్తయ్యే వరకూ తాము అతడికి అండగా నిలవలేమని తెలిపారు. దీంతో ఎంతో ప్రతిష్ఠాత్మక వెబ్ సిరీస్గా చెబుతున్న `ది వెర్డిక్ట్` ప్రాజెక్ట్ నుంచి సుభాష్ కి ఊస్టింగ్ ఇచ్చినట్టయ్యింది. మొత్తానికి ఒకే ఒక్క ఆరోపణ ఆ రేంజులో కొంప ముంచిందన్నమాట! ఈ ఉద్యమంతో ఇంకా ఎందరు ప్రముఖులకు మూడనుందో అన్న టెన్షన్ వాతావరణం అలుముకుందిప్పుడు.

 

డైరెక్టర్ సాజిద్ ఖాన్ Vs నటి సలోని చోప్రా

Image result for sajid khan saloni chopra

సినిమా అవకాశాల కోసం వచ్చే చాలా మంది అమ్మాయిలను సాజిద్ దారుణంగా వేధించాడని సలోని చెప్పింది. ఓ సారి ఓ సినిమా షూటింగ్‌ సమయంలో ఓ అమ్మాయి ట్రయల్ రూమ్‌లో డ్రెస్ ఛేంజ్ చేసుకుంటుండగా, సాజిద్ ఆమె వద్దకు వచ్చాడని, ఆమె స్కర్ట్ పైకి లేపి పిరుదులు చూపమని అడిగాడని ఆమె తెలిపింది. "సరైన    కొలతలే లేవు ఏం నటివి అవుతావు? అంటూ సదరు నటిపై సాజిద్ అసభ్యకరవ్యాఖ్యలు చేశాడని సలోని చెప్పింది. తనకు బ్రెస్ట్, బ్యాక్ సరిగా లేవంటూ దూషించాడని తెలిపింది. ఆమె షాక్‌కు గురవగా, నచ్చజెప్పాల్సిందిగా సాజిద్ తనను పురమాయించాడని చెప్పింది. ఆ ఘటన తనకు అత్యంత ఆగ్రహం తెప్పించిందని వివరించింది.


గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్ గురించి అసభ్యకరంగా: సాజిద్ తన ప్రియురాలితో సెక్స్ చేసిన విషయాల గురించి కూడా తన వద్ద చాలా అసభ్యకరంగా మాట్లాడేవాడని సలోని తెలిపింది. "ఇండస్ట్రీ లో నాకు పరిచయమైన అద్భుత వ్యక్తి ఆమె. చాలా మంచిది. అంతకుమించి సేవాభావం ఉన్నది. అలాంటి వ్యక్తి సాజిద్ లాంటి దుర్మారుడిని తన బాయ్‌ఫ్రెండ్‌ గా ఎందుకు ఎంచుకుందో నాకు అర్థమయ్యేది కాదు" అని సలోని చెప్పుకొచ్చింది.


"గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్ గురించి నా ముందే దారుణంగా మాట్లాడేవాడు. ఆమెతో గడిపినరాత్రుల గురించి, సెక్స్-లైఫ్ గురించి చెప్పేవాడు. తన మర్మాంగాన్ని పట్టుకోమని అడిగేవాడు. అలాంటి పనులను నాతో చేయిస్తూ నరకం చూపించాడు" అని సలోని రాసుకొచ్చింది.


సాజిద్ వేధింపులు భరించలేక చివరికి ఓ రోజు అతణ్ని నిలదీశా నా నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావో చెప్పాలని నిలదీశా. అందుకు అతడు బదులిస్తూ, నువ్వు నాతోనే ఉండు. నీతో గడపాలని ఉంది’ అని చెప్పేవాడు. అతడి మాటలకు ఎదురు చెబితే తన అంతు చూస్తానని బెదిరించినట్లు ఆమె చెప్పింది. ఒక రోజు సాజిద్ తన ఇంటికి పిలిపించుకొని కోరిక తీర్చమని అడిగాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన నేను అతడి బండారం బయటపెడుతానని హెచ్చరించా. అతడు నాపై స్వరం పెంచి, కాల్చి చంపు తానని బెదిరించాడు. ఇండస్ట్రీలో నాకు జీవితం లేకుండా చేస్తానన్నాడు’ అని సలోని చెప్పుకొచ్చింది. చాలా రోజులపాటు సాజిద్ దారుణాలను మౌనంగా భరించానని సలోని తెలిపింది. ఏం చేయాలో, ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలిసేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఓ దశలో చచ్చిపోదామని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.


సాజిద్ ఖాన్ దారుణాలు వెలుగులోకి వచ్చిన వెంటనే హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. తాను హీరోగా సాజీద్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హౌస్‌ ఫుల్‌ - 4 షూటింగ్‌ ను నిలిపేయాలని అక్షయ్‌ కుమార్‌ చిత్ర నిర్మాతలను కోరారు. సాజీద్‌ ఖాన్‌ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ పూర్తైన తర్వాతే షూటింగ్‌ మొదలు పెడుదామని ట్వీట్‌ చేశారు.


మహిళా జర్నలిస్టు Vs టాటా మోటార్స్ సురేశ్ రంగరాజన్‌

Image result for me Too effects

టాటా మోటార్స్ — కార్పొరేట్ కమ్యూనికేషన్స్ చీఫ్ సురేశ్ రంగరాజన్‌ ను సెలవులపై వెళ్లాల్సిందిగా ఆదేశించినట్టు టాటా మోటార్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఆయన పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో చేపట్టిన అంతర్గత విచారణ త్వరితగతిన పూర్తయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సురేశ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపిస్తూ మహిళా జర్నలిస్టు ఒకరు ట్విట్టర్‌లో స్క్రీన్‌షాట్లను పోస్టు చేశారు. దీనిపై స్పందించిన కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ మాట్లాడుతూ.. తమ సంస్థలో ప్రతి ఒక్కరికీ పూర్తిగా రక్షణ ఉంటుందని పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతామని, నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపింది.


ఐశ్వర్యరాయ్  Vs సల్మాన్‌ ఖాన్‌

Image result for aiswarya harassed by salman

బాధితులందరికి దేవుడు మనో బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఐశ్వర్యకు కూడా ఇలాంటి వేధింపులు తప్పలేదు. ఈ విషయం గురించి గతంలో ఐశ్వర్యరాయ్  "2002లో మేము బ్రేకప్‌ చెప్పుకున్న తర్వాత కూడా అతను నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాదు. అతను నా గురించి చెత్త వాగుడు వాగేవాడు. మే కలిసి ఉన్నప్పుడు కూడా అతను నన్ను శారీరకంగా హింసించేవాడు. అదృష్టం ఏంటంటే ఆ గాయాల వల్ల ఎటువంటి మచ్చలు ఏర్పడలేదు. అందువల్లే తరువాతి రోజు ఏం జరగనట్లే నా పని చూసుకునే దాన్ని’ అని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: