2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కోసం ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో పోటీ చేయకుండా టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు తెలిపి ఏపీ లోకి టీడీపీ అధికారంలోకి రావటానికి ప్రముఖ పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఆ సమయంలో జరిగిన తెలంగాణ ఎన్నికలలో కూడా ఎన్డీయే కూటమికి మద్దతు తెలపడం జరిగింది.

Image may contain: 4 people, people smiling

అయితే ఆ తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టడం కొంత తగ్గించారు. ఈ క్రమంలో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన టీడీపీ విచ్చలవిడిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుని ప్రస్తుతం 2019 ఎన్నికల కోసం జనసేన పార్టీని స్వతంత్రంగా పోటీచేసే దశలో తెంపడానికి అన్ని విధాలా రెడీ అవుతున్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.

Image may contain: 3 people

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చా 2019 ఎన్నికల్లో పోటీ పడటానికి సిద్ధమవుతున్నారట పవన్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన పార్టీ నేతలతో ఈ నెల 16 వ తారీఖున సమావేశం కానున్నారు. కనీసం రానున్న ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీ చేయాలన్నే ఆలోచనలో ఉన్నారట పవన్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని సర్వేలు వాతావరణం చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా పోయింది.

Image may contain: 1 person, beard and outdoor

ఈ సందర్భంగా ఎలాగైనా ఈసారి కేసీఆర్ ని పెంచడం కోసం ప్రధాన పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా పాల్పడిన విషయం మనకందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కి గట్టి దెబ్బ కొట్టేలా పవన్ కళ్యాణ్ సరైన వ్యూహాలతో తెలంగాణ ఎన్నికలలో అడుగు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట.




మరింత సమాచారం తెలుసుకోండి: