పవన్  కళ్యాణ్ పార్టీలో కి నాదెండ్ల మనోహర్ రావడం తో జనసేన చాలా ఉత్సాహం లో ఉంది అయితే జనసేన నాయకులూ కూడా దసరా తరువాత ఇంకా వలసలు పెరుగుతాయని సంబరాలు చేసుకుంటున్నారు. అయితే  గతంలో జర్నలిస్ట్‌గా పనిచేసిన విజయ్‌బాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌టిఐ కమిషనర్‌గానూ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెల్సిందే. ఆయనే, జనసేన పార్టీకి సంబంధించి 'విజయదశమి' చేరికలపై వ్యాఖ్యానించడం గమనార్హం.


ఆ విషయం లో పవన్ జగన్ ను బీట్ చేస్తాడా...!

ప్రస్తుతం జనసేన అధికార ప్రతినిధిగా విజయ్‌బాబు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పిన మాజీ సభాపతి నాదెండ్ల మనోహర్‌, జనసేన పార్టీలో చేరుతున్న సంగతి తెల్సిందే. ఆయనతోపాటు మరికొందరు కీలక నేతలు జనసేన వైపుకు వస్తున్నారట.  జనసేనలోకి పెద్దయెత్తున చేరికలు జరగబోతున్నాయనీ, అందుకు పార్టీ సర్వసన్నద్ధంగా వుందనీ, అక్టోబర్‌ నెల జనసేన పార్టీకి అత్యంత కీలకం కాబోతోందనీ విజయ్‌బాబు అంటున్నారు. మరోపక్క, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌, జనసేన వైపుగా వద్దామనుకుంటోన్న వివిధ పార్టీలకు చెందిన నేతలతో స్వయంగా మాట్లాడుతున్నారు.. వీలైనంత ఎక్కువగా పార్టీలోకి 'చేరికల్ని' ప్రోత్సహించాలన్నది ఆయన ఉద్దేశ్యంగా కన్పిస్తోంది. 


ఆ విషయం లో పవన్ జగన్ ను బీట్ చేస్తాడా...!

అయితే, పార్టీలో చేరినోళ్ళంతా పార్టీకి బలం అవుతారనుకుంటే పొరపాటే. ప్రజారాజ్యం పార్టీ విషయంలో ఏం జరిగిందో పవన్‌కళ్యాణ్‌కి తెలియనిది కాదు. పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినవారే, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని ముంచేశారు. ఈ నేపథ్యంలోనే పవన్‌కళ్యాణ్‌, ఆచి తూచి అడుగులేస్తున్నారు. చేరికల విషయంలో పవన్‌ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయోగానీ.. ఫలానా నియోజకవర్గంలో జనసేనను ఫలానా నేత గెలిపించగలడన్న పరిస్థితి ప్రస్తుతానికైతే లేకపోవడం గమనార్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి: