"ఏ దేశ చరిత్ర చూసినా ఏ మున్నది గర్వకారణం - నరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం"  అన్నారు మహాకవి శ్రీ శ్రీ . - అది వ్యక్తులకు ముఖ్యంగా దేశాన్ని కుదిపేసే  # Me..Too ఉద్యమానికీ వర్తిస్తుంది కూడా!

Image result for sapna bhavnani on amitabh bacchan with his heroines # Me Too

గంటకో కలకలం, పూటకో సంచలనం, రోజుకో గందరగోళం, చిందరవందర వెలుగులోకి వస్తోంది. బాలీవుడ్‌ లో అయితే, ఎప్పుడు ఎవరి పేరు బయట కొస్తుందో అనే ఆందోళన నెలకొంది. పరిశ్రమను ఒకప్పుడు నిర్దేశించి అసామాన్యులుగా నిలిచిన బడా... బడా వ్యక్తుల తెర వెనుక బాగోతాలు శరపరంపరగా వెలుగులోకి వస్తున్నాయి. సెలబ్రిటీలు, బాగా "ఫ్యాన్ ఫాలోయింగ్"  ఉన్న నటులపై కూడా సంచలన ఆరోపణలు వస్తున్నాయి. # మీ... టూ... సునామీ ఇప్పుడు వేగం పుంజుకొని మరీ ఝంఝామారుతంగా మారి బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ను కూడా చుట్టేయనుందా! ఆయన పేరు కూడా బయటకు రావడం బాలీవుడ్ పరిశ్రమని కలవరానికి గురిచేస్తోంది. 

Image result for sapna bhavnani on amitabh bacchan # Me Too

సెలబ్రిటీ హెయిర్‌ స్టయిలిస్ట్‌, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సప్నా భవ్నానీ, బిగ్ బీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. # మీ..టూ...కు మద్దతుగా ఆయన మాట్లాడటం, అంతకంటే పెద్ద అబద్ధం మరోకటి ఉండదని పేర్కొన్నారు. త్వరలోనే అమితాబ్ గారి అసలు స్వరూపం బయట పడవచ్చని హెచ్చరించారు. 


బిగ్ బీ సర్‌! మీరు నటించిన పింక్‌ సినిమా వచ్చింది, వెళ్లిపోయింది. అదే విధంగా మీకున్న సామాజికవేత్త అనే బిరుదు కూడా పోతుంది. త్వరలో మీ నిజా
లన్నీ బయట పడతాయి. నా ట్వీట్‌ చూసి మీరు తెగ కంగారు పడతారు. చేతి గోర్లు కొరుక్కుంటూ ఉంటారు. ఆ లెక్కన కొరుక్కోవడానికి మీకున్న గోర్లు కూడా సరిపోవు  అని సప్నా భవ్నానీ ట్వీట్‌ చేశారు. 
Image result for sapna bhavnani on amitabh bacchan # Me Too

ఇటీవల ఒక ఇంగ్లీష్ జాతీయ మీడియా తో ఇంటర్వ్యూ సందర్భంగా బిగ్‌ బిని #మీటూ ఉద్యమం పై అమితాబ్ స్పందిస్తూ ఏ మహిళ కూడా ఎక్కడా లైంగిక వేధింపులు ఎదుర్కోకూడదు. ముఖ్యంగా ఆమె పనిచేసే వాతావరణంలో ఇలాంటివి ఉండకూడదు. అలాంటివి ఎదురైనప్పుడు నిందితులపై ఆయా సంస్థలు వెంటనే చర్యలు తీసుకోవాలి  అన్నారు. 


మన సమాజం లో మహిళలు, పిల్లల పట్ల నేటికీ బలహీనులనే ముద్ర ఉందని, అందువల్ల వారికి ప్రత్యేక రక్షణ కల్పించాలని అమితాబ్ బచ్చన్ అన్నారు. మన దేశంలో పని చేసే ప్రదేశాల్లోనే మహిళలు, ఎక్కువగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని, ఇది తన మనసును తీవ్రంగా కలచివేస్తోందని అమితాబ్ అన్నారు. మహిళలకు దక్కాల్సిన గౌరవం, రక్షణ ఇవ్వక పోతే మన దేశంపై చెరపలేని మచ్చ పడుతుందన్నారు. 


"స్త్రీ ఒక మాటవల్లా, చూపువల్లా పురుషునికి సందిచ్చిందా. . . . ఇక అతని అధికారానికీ, కోరికలకీ, విన్నపాలకీ అంతం ఉండదు. అసలు ఆ పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటి నించి విముఖం గానే ఉండాలి. . . . . . నిప్పు వలె ఉండాలి, . . " గుడిపాటి వెంకట చలం (విఖ్యాత స్త్రీవాద రచయిత)


అయితే అమితాబ్ వ్యాఖ్యలకు ప్రఖ్యాత హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవ్నానీ చాలా ఘాటుగా స్పందించారు. ఆమె చేసిన ట్వీట్‌ అంతర్జాలంలో చర్చనీయాంశంగా మారింది. అమితాబ్‌ గురించి ఏ నిజం బయట పడుతందోనని ఆసక్తిగా చూస్తున్నారు నెట్ సంచారులు. అసలేం జరిగింది? అంటూ కొంతమంది నెటిజన్లు సప్నా భవ్నాని  కి మెసేజ్‌ లు పెడుతున్నారు. 

Image result for sapna bhavnani on amitabh bacchan with his heroines # Me Too

మరింత సమాచారం తెలుసుకోండి: