పవన్ కళ్యాన్ జనసేన రాజకీయాలను  పీక్స్ తీసుకువెళ్ళే భారీ ఈవెంట్ ఒకటి జరగబోతోంది. మరో ఇరవై  నాలుగు గంటల్లో జరిగే ఆ  మెగా ఈవెంట్ తరువాత ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయని జన సైనికులు అంచనా వేస్తున్నారు. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న రాజకీయాన్ని స్పీడెక్కించేందుకు, రెండు పెద్ద పార్టీలకు గట్టి జవాబు చెప్పేందుకే జనసేన కవాతు అంటున్నారు.


అందుకోసమేనా :


ఇంతకాలం జనసేన ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపించేంది. లేదా పవన్ మీటింగుల్లో కనిపించేది. ఇపుడు ఏపీ లో పార్టీని హాట్ టాపిక్ చేయడానికి జనసైనికులు ఉవ్విళ్ళూరుతున్నారు. మూడు నెలల క్రిత్రం జగన్ గోదావరి వంతెనపై జరిపిన పాదయాత్ర ఎలా ఆకట్టుకుందో అంతకు  మించి రెస్పాన్స్ తెచ్చేందుకు జనసేన పదునైన వ్యూహమే రచిస్తోంది.
ఈ దెబ్బకు ఏపీలో పాలిటిక్స్ అబ్బా అనేలాగ‌ కవాతు ఉండాలనుకుంటోంది. గోదావరీ తీరంలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల ఈ కవాతు నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా చేయడానికి అంతా సిధ్ధమైపోయింది.


ఇప్పటికే ఊపు :


కవాతు ప్రోగ్రాం అలా ఉండగానే జనసేనలో జోష్ వచ్చేసింది. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ పార్టీలో చేరడంతో జనసేన కొత్త ఊపులో ఉంది. ఇక మరికొంత మంది అధికార పార్టీకి చెందిన కీలక నాయకులు కూడా పార్టీ తీర్ధం తీసుకుంటారన్న వార్తలు కూడా హుషారెత్తిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే   రేపటి రోజున అందరికీ ఆశాకిరణంలా జనసేన ఉంటుందని చెప్పేందుకే కవాతు భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.


మొగ్గు కొసమే :


ఏపీలో పాలిటిక్స్ ఇప్పటికిపుడు చూసుకుంటే టీడీపీ, వైసీపీల మధ్యనే కేంద్రీక్త్రుతమై ఉంది. దాన్ని బద్దలు కొట్టాలన్నా, మొగ్గు కనిపించాలన్న జనసేనకు కవాతు బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇప్పటికే జనసేన కవాతుకు సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ఇచ్చాయి. కవాతు కోసం పదమూడు జిల్లాల నుంచి కార్యకర్తలను జనసేన సమీకరిస్తోందంటే ఎంత ప్రెస్టేజ్ గా తీసుకుంటోందో అర్ధం చేసుకోవాలి. 


ఆ రోజున లక్షల్లో జనం కవాతు చెస్తూ కనిపించాలని, యావత్తు ఏపీ దాన్ని గురించే మాట్లాడుకోవాలని జనసేన ప్లాన్ వేస్తోంది. దీన్ని బట్టి చూస్తూంటే జానసేన హడావుడి మామూలుగా ఏం లేదు. కవాతు వెనక మాస్టర్ మైండ్సే ఉన్నాయని అర్ధం అవుతోంది.
.


మరింత సమాచారం తెలుసుకోండి: