వర్మ చంద్ర బాబు కు ఇప్పుడు పక్కలో బల్లెం లా తయారయ్యాడు. ఎన్టీఆర్ బయో పిక్ ను లక్ష్మీస్ ఎన్టీఆర్ గా తీస్తానని ప్రకటించినప్పటి నుంచి బాబు కు వర్మ ఫోబియా పట్టుకున్నట్లు ఉంది. అయితే ఇప్పడూ చంద్ర బాబు మాదిరిగా ఉండే ఒక వ్యక్తి వర్మకు దొరికేయడంతో అతన్ని వర్మ  పెట్టి బయో పిక్ తీస్తాడని అందరూ అనుకుంటున్నారు. నిజంగా ఇది బాబు కు అవమానకరమే. ఒక రాష్ట్ర ముఖ్య మంత్రి పాత్రలో ఒక అనాముకుడైన వాడు నటిస్తున్నాడంటే బాబు కు అవమానకరమే.

వర్మకు దొరికిన 'చంద్రబాబు'

అయితే  డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఆ వ్యక్తి ఎవరో, ఎక్కడుంటాడో తెలిపితే, లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి అచ్చం చంద్రబాబు నాయుడు మాదిరిగా వుండడంతో, తీసుకెళ్లి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో వేషం ఇవ్వాలన్నది వర్మ ఐడియా. అయితే దీనీకి ట్విట్టర్ లో రోహిత్ అనే మీడియా పర్సన్ స్పందించి వివరాలు అందించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వర్మ నేరుగా ట్విట్టర్ లో ఖరారుచేసి, రోహిత్ కు థాంక్స్ చెప్పాడు. టైటిల్ కార్డ్స్ లో పేరు వేస్తా అని బ్యాంక్ డిటైల్స్ పంపిస్తే ఇస్తానన్న లక్ష రూపాయలు ఇస్తా అని ప్రకటించాడు.

Image result for ram gopal varma

అయితే రోహిత్ అనే వ్యక్తి దీన్ని సున్నితంగా తిరస్కరించారు. తనకు ఆ వ్యక్తి తెలుసు కనుక వివరాలు అందించా అని, లక్ష రూపాయల కోసం కాదని, ఆ మొత్తాన్ని ఆ మధ్య తెలంగాణలో జరిగిన బస్ ప్రమాద బాధితులకు అందించాలని పేర్కొన్నాడు. ఆ విధంగా రోహిత్ హీరో అయ్యాడు.  మరి ఇంతకీ చంద్రబాబులా వున్న వ్యక్తి వివరాలు మాత్రం బయటకు వెళ్లడించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: