మహిళా పాత్రికేయులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా నైజీరియా పర్యటనలో ఉన్న అక్బర్, ఆదివారం ఉదయం భారత్ కు తిరిగి వచ్చారు. అయితే, విమానాశ్రయంలో మీడియా తో మాట్లాడకుండానే ఆయన వెళ్లి పోయారట. అనంతరం మెయిల్ ద్వారా ప్రధాని కార్యాలయానికి అక్బర్ తన రాజీనామా లేఖను పంపించినట్టు తెలుస్తోంది. 
Image result for mj akbar vs priya ramani

మంత్రి రాజీనామా విషయాన్ని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, ఎంజె అక్బర్ ఎడిటర్‌ గా పనిచేసిన  సమయంలో తమను వేధించాడంటూ ఇటీవల ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కేబినెట్ నుంచి తప్పుకోవాల్సిందేనన్న ఒత్తిడి పెరిగింది. విదేశీ పర్యటన నుంచి రాగానే రాజీనామా చేస్తారని ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. దేశ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం ప్రకంపనలు కొనసాగుతున్న వేళ పలురంగాలకు చెందిన మహిళ లు తమపై జరిగిన లైంగిక వేధింపులను బయటపెడుతున్నారు
Image result for mj akbar vs priya ramani

తాము ఎక్కడికి వెళ్లినా అక్బర్ ఉదంతం పైనే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తున్నదని ఇతర మంత్రులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు అటు బీజేపీగానీ, ఇటు విదేశాంగ మంత్రి సుష్మా తో పాటు ఏ ఇతర మంత్రీ ఈ ఆరోపణలపై స్పందించ లేదు. అక్బర్ తన కెరీర్‌ లో టెలీగ్రాఫ్, ఏషియన్ ఏజ్, ద సండే గార్డియన్‌లాంటి ప్రముఖ పత్రికల ఎడిటర్‌గా పనిచేశారు.
Image result for priya ramani journalist
ఆ సమయంలో ఆయన తనను వేధించారంటూ తొలిసారి ప్రియారమణి అనే జర్నలిస్ట్ బయటపెట్టింది. ఆ తర్వాత పలువురు ఇతర మహిళా జర్నలిస్టులు కూడా అక్బర్‌పై ఇలాంటి ఆరోపణలే చేశారు. హైదరాబాద్ కు చెందిన దక్కన్ క్రానికల్కు పాత్రికే య సంబంధాలు ఉన్నాయి. 

Image result for mj akbar vs priya ramani

నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం, కల్పితం.  అసూయతోనే  నాపై నిందలు వేస్తున్నారు. నేను విదేశీ పర్యటనలో ఉండటంతో ఈ ఆరోపణలపై స్పందించ లేదు. కానీ ఇప్పుడు వీటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను. ఎలాంటి ఆధారం లేని ఆరోపణలు వైరల్‌గా మారుతున్నాయి.


ఏదేమైనా ఇప్పుడు నేను వచ్చేశాను. భవిష్యత్‌ కార్యాచరణ ఏంటనేది నా లాయర్లు నిర్ణయిస్తారు’ అని అక్బర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందే ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక అజెండా ఏంటి? అనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాని అక్బర్‌ అన్నారు. తన పరువు, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Image result for gajala wahab Vs MJ Akbar

‘నేను స్విమ్మింగ్‌ పూల్‌లో పార్టీ చేసుకుంటానని ఒకరు అన్నారు. కానీ నాకు ఈత కొట్టడమే రాదు’ అని అక్బర్‌ తెలిపారు. రాజీ నామాపై వస్తున్నవార్తలపై ఆయన ఎలాంటి ప్రకటనచేయలేదు. మరోవైపు అక్బర్ తనపదవి నుంచి తప్పుకోవట్లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం.


21 ఏళ్ల క్రితం తనను కార్యాలయంలో వేధించారంటూ గజాలా వహెబ్ అనే ఆమె ఆరోపిస్తున్నారని, ఇది కేవలం తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడమేనని అన్నారు. 'ప్రజా జీవితంలోకి తాను అడుగుపెట్టడానికి పదహారేళ్ల ముందు మాట ఇది. అప్పుడు నేను మీడియాలో ఉన్నాను'  అని అక్బర్ పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తాను ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని కూడా మంత్రి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: