మాజీ పార్లమెంటరియన్ ఉండవల్లి అరుణకుమార్ పరిశోదించి వెలికితీసి న్యాయస్థానానికి చేసిన పిర్యాదు కేసు మార్గదర్శి ఫినాన్సియర్స్ ఇంతకాలం కోర్ట్ యిచ్చిన "విచారణ నిలుపుదల" కేసుకు స్టే పీరియడ్ ముగియటంతో మళ్ళీ కోర్ట్ లో విచారణ  కొనసాగించటానికి ఆదేశాలు జారి అయ్యాయి.

Image result for margadarsi court case

రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించి మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్ల సేకరణ చేయడంపై రామోజీరావుకు చెందిన మార్గదర్శి సంస్థ పై కొనసాగిన విచారణపై స్టే విధించిన కాలం పూర్తి అయ్యింది. ఆర్థిక నేరాల వ్యవహారంలో విచారణకు సంబంధించి స్టే ను ఆరు నెలలకు మించి కొనసాగించేందుకు వీల్లేదని,  ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మార్గదర్శిపై విచారణ మళ్లీ మొదలు కావాల్సి ఉంది.

Image result for margadarsi court case

మరోసారి ఈ కేసు విచారణపై స్టే పొడిగించాలని మార్గదర్శి కోరగా, దానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి వ్యవహారంలో కౌంటర్ ను దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, ఈ కేసులో పిటిషనర్ అయిన ఉండవల్లి అరుణకుమార్ కు సుప్రీంకోర్టు ఇది వరకే నోటీసులు కూడా జారీ చేసింది. అయితే కౌంటర్ కు మరికొంత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోరారు.

Image result for margadarsi court case

ఇక స్టే కోసం వెళ్లిన రామోజీరావు వాళ్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బే తగిలినా కొంత ఊరట కూడా దక్కింది. ఈ వ్యవహారంపై మళ్లీ హైకోర్టుకు వెళ్లడానికి సుప్రీంకోర్టు అను మతి ని ఇచ్చింది. అంటే స్టే కోరుతూ, హైకోర్టును మరిప్పుడు  ఆశ్రయించవచ్చుననమాట.

Image result for margadarsi court case

ఇదీ కథ. హైకోర్టు లెవల్లో ఈ అంశంపై మళ్లీ విచారణ జరగాల్సి ఉంది. అప్పుడు రామోజీరావు మళ్లీ స్టే తెచ్చుకుంటాడేమో? మొత్తం విచారణలు నిలుపుదల చేసుకుంటూ బ్రతికెయ్యటం వీరికి తొలి నుంచీ ఉన్న అలవాటే వీళ్ళు మాత్రం వీళ్ళ పత్రికలు చానల్స్ ద్వారా ప్రజలకు ప్రతిపక్షాలకు రోజూ నీతులు వల్లిస్తుంటారనేది జగమెరిగిన సత్యం. 

Image result for margadarsi court case

ఎవరో అన్నట్లు  చెప్పేటందుకే నీతులు వున్నాయి పాటించేతందుకు కాదు, అన్నట్లు ఉషోదయాన్నే లేచి పాచి పళ్లతో పదుగురికి సారీ! అందరికీ నీతులు చెప్పే రామోజీ గ్రూప్, ఇలా విచారణలపై స్టేలు తెచ్చుకోవడానికి ప్రయత్నించడానికి మించిన సిగ్గు మాలిన తనం ఏముంటుంది. మరీ విడ్డూరం కాకపోతే ఏముంది?

మరింత సమాచారం తెలుసుకోండి: