రాజకీయాల్లొ  వారసత్వాలు ఇపుడు సర్వ సాధారణం. తాము కూడబెట్టిన ఆస్తిలాగానే జనాభిమానాన్ని కూడా చాలా తేలిగ్గా నాయకులు బదిలీ చేస్తున్నారు. వాటి మీద సర్వాధికారాలు తమకే చెందుతాయని వారసులు కూడా ఎపుడో డిసైడ్ అయిపోయారు. అందువల్ల తమ తండ్రి, తల్లి ఆస్తినే కాదు కీర్తిని కూడా వారసత్వంగా పుచ్చేసుకుంటున్నారు.


ఆయన రెడీట :


విషయానికి వస్తే రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసి ప్రస్తుతం ఉప రాష్ట్రపతి వంటి కీలకమైన పదవిలో ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు ఏకైక కుమారుడు విష్ణువర్ధన్ నాయుడు రాజకీయాల్లొకి ప్రవేశిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. విశాఖలో చాలా కాలం క్రితమే వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన వ్యాపారవేత్తగా విష్ణు పేరు తెచ్చుకున్నారు. తండ్రి ప్రత్యక్ష  రాజకీయాల్లో ఉన్నపుడు ఎన్నడూ ఎటువంటి జోక్యం చేసుకోని ఆయన ఇపుడు హఠాత్తుగా రాజ‌కీయాల వైపు చూడడం ఆసక్తిని కలిగించే అంశమే.


ఆ వైపు అనుకున్నారు :


నిజానికి వెంకయ్యనాయుడు రాజకీయ వారసురాలిగా కుమార్తె దీపా వెంకట్ ని అంతా అనుకునేవారు. ఆమె సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ జనాల్లోకి వచ్చింది ఎక్కువ. స్వర్ణ భారత్ ట్రస్ట్ పేరిట విశాఖలోని కాపులుప్పాడ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆమె అక్కడ అభివ్రుధ్ధి పనులు నిర్వహించారు. ఆమె విశాఖ మేయర్ బరిలో ఉంటారని, ఎమ్మెల్యేగా చేస్తారని గతంలో విపరీతమైన ప్రచారం జరిగింది.


జవసత్వాలే ముఖ్యం :


ఇక వెంకయ్యనాయుడు ఎపుడూ నేరుగా వారసత్వాలను ప్రోత్సహించలేదు. ఆయన ఏ మీటింగులోనైనా చెప్పే మాట ఒక్కటే. వారసత్వం కాదు, జవసత్వాలు ముఖ్యమని అంటూ అన్ని పార్టీలను ఏకేసేవారు. మా పిల్లలు ఎవరూ రాజకీయాల్లోకి రారు, ఎవరికీ ఎటువంటి భయాలు అవసరం లేదని కూదా చతుర్లు వేసేవారు. మరి అటువంటి వెంకయ్య ఇంట్లోనుంచి ఏకంగా కుమారుడే ఎంట్రీ ఇస్తారని టాక్ రావడం విశేష పరిణామమే.


ఆ పార్టీ నుంచేనా :


 వెంకయ్య కొడుకు రాజకీయాల్లొకి వస్తే విశాఖ ఎంపీగా బరిలో దిగుతారని అంటున్నారు. అయితే ఏ పార్టీ అంటే కచ్చితంగా తండ్రిని పెంచి పెద్ద చేసిన బీజేపీ నుంచేనని అంటున్నారు. చూస్తే బీజేపీకి విశాఖలో అంత సీన్ లేదు. అది తెలిసే సిట్టింగ్ ఎంపీ హరిబాబు ఈసారి పోటీ చేయనని అంటున్నారు. మరి. ఎంత వెంకయ్య కొడుకు అయినా ఆయన గెలిచేస్తారా అన్న డౌట్లు వస్తున్నాయి. మరి ఏ పార్టీతోనైనా పొత్తులు ఉంటే పోటీకి రెడీ అంటారేమోనని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: