సీనియర్ నాయకులకు ప్లస్ మైనస్ రెండూ ఉంటాయి. వారి వల్ల పార్టీకి మంచి జరుగుతుందంటే పక్కన పెట్టుకుంటారు. ఏకు మేకు అవుతారనుకుంటే జాగ్రత్త పడతారు. అనుభవం అన్నది ఇలా ఒక్కోసారి మేలు కంటే చేటు చేస్తుంది. మరి సీనియర్లకు షాక్ కూడా అలా తగులుతూ ఉంటుంది.


బొత్సకు షాక్ :


విజయనగరం జిల్లాలో ఇపుడు జగన్ పాదయాత్ర సాగుతోంది. ఈ జిల్లా అంటే సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణకు ఇలాకా. మరి అటువంటి జిల్లాలో సొంత నేతకే షాకులను అధినేత ఇస్తున్నారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జగన్ జిల్లాలోకి వస్తూ వస్తూనే బొత్స వైరి వర్గంలోకి కోలగట్ల వీరభద్రస్వామికి టికెట్ కన్ ఫాం చేసేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విజయనగరం టౌన్ నుంచి అసెంబ్లీకి బరిలో ఉంటారని జగన్ నిండు సభలో ప్రకటించారు. ఇది బొత్స వర్గానికి తొలి షాక్.


అక్కడ అలా :


ఇక బొత్స ఫ్యామిలీకి బలమైన కోటగా ఉన్న గజపతినగరం అసెంబ్లీ సీటుని ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య ఆశిస్తున్నారు. ఇందుకోసం చాలాకాలంగా గ్రౌండ్ వర్క్ కూదా ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉన్నారు. జగన్ సై అంటే ఫుల్ జోష్ తో ప్రచారంలోకి దూకేద్దామని అంతా రెడీ చేసి పెట్టుకున్నారు. గజపతినగరం మీటింగులో జగన్ అప్పలనరసయ్యని పార్టీ క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తారని ఆశించారు. తీరా జగన్ ఆయన పేరు చెప్పకుండానే సభ ముగించేశారు. దీంతో అప్పలనరసయ్యతో పాటు బొత్స కూడా షాక్ తిన్నారట.


మిగిలిన వారి సంగతేంటి :


జగన్ పార్టీలో తనదైన  హవా చూపించవచ్చని కనీసంగా అరడజన్ కి తక్కువ కాకుండా టికెట్లు తీసుకోవచ్చునని బొత్స ఆశించారు. తీరా చూస్తే పరిస్థితి రివర్స్ గేర్ లో వెళ్తోంది. జగన్ ఒక్క టికెట్ కూడా ఇప్పటివరకు బొత్స వర్గీయులకు అనౌన్స్ చేయలేదు దీంతో డిఫెన్స్ లో అంతా పడ్డారు. బొత్స సోదరునికే ఇలా ఉంటే అనుచరులకు టికెట్లు ఏం వస్తాయన్న చర్చ కూడా స్టార్ట్ అయిపోయింది. 


ఎందుకిలా :


నిజానికి జగన్ బొత్సకు చాల విలువా, గౌరవం ఇస్తారు, కానీ ఆయన వర్గానికే నిరాశ కలిగేలా జగన్ ఎందుకు వ్యవహరిస్తున్నారాన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. కోలగట్లకి టికెట్ ప్రకటిచిన జగన్ అప్పలనరసయ్య దగ్గరకు వచ్చేసరికి ఎందుకిలా చేశారని అంతా చర్చించుకుంటున్నారు. బొత్సను జగన్ నమ్మడం లేదా, లేక వేరే కారణాలు ఉన్నాయా. అని తర్కించుకుంటున్నారు. బొత్స ఫ్యామిలీకి ఎన్ని టికెట్లు ఇస్తారో కూడా ఇపుడెవరూ చెప్పలేకపోతున్నారు. మొత్తానికి జగన్ వైఖరితో బొత్స వర్గం రగిలిపోతోందిట.


మరింత సమాచారం తెలుసుకోండి: