శ్రీకాకుళం  జిల్లాను తిత్లీ తుపాను వణికించింది. చెప్పాలంటే మొత్తానికి మొత్తం తిరగేసింది. చిన్నభిన్నం చేసేసింది. అంతటి పెను విపత్తు జరిగితే  సహాయ చర్యలు మాత్రం పెద్దగా లేవన్న విమర్శలు సర్వత్రా  వినిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే నాలుగేళ్ళ క్రితం విశాఖను కుదిపేసిన హుదూద్ తుపాను కంటే కూడ అతి పెద్ద తుపానే శ్రీకాకుళం కళ్ళ చూసింది.  ఇంతటి విపత్తును ఏ మీడియా సరిగా కవర్ చేయలేదు. దాంతోనే సమాజానికి అసలు విషయాలు తెలియడంలేదు.


ఇప్పటికీ జలంలోనే :


శ్రీకాకుళంలోని ఉద్దానం, పలాసా, సోంపేట తదితర ప్రాంతానన్నీ ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. అంతే కాదు జిల్లావ్యాప్తంగా తీరని నష్టం జరిగింది. బాధితుల ఆక్రందనలు ఎక్కడ చూసిన వినిపిస్తునాయి. తాగేందుకు నీళ్ళు లేక ప్రజలు అల్లాడుతున్నారు. విడేశాల నుంచి ప్రతీ ఏటా శ్రీకాకుళం వచ్చే పక్షులతో సహా పశువులు, మేక మందా అంతా కొట్టుకునిపోయాయి. దాదాపు పది మంది వరకు మ్రుత్యువాత పడ్డారు. వేలాదిగా జనం నిరాశ్రయులయ్యారు. లక్షల్లొ జనం ఆకలితో అల్లడుతున్నారు. 


బాబునే అడ్డుకున్నారు :


ఇక శ్రీకాకుళం పలాసా మునిసిపాలిటీ ఆఫీస్ నే క్యాంప్ గా చేసుకుని చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. ఆయన మూడు రోజుల పాటు అక్కడే గడిపారు. కానీ జనాలకు స్వాంతన మాత్రం చేకూర్చలేకపోయారు. సాక్షాత్తూ సీఎం కాన్వాయ్ నే బాధితులు అడ్డగించి తమ గోడు వెళ్ళబోసుకున్నారంటే అక్కడ పరిస్తితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవాలి. ఇక ఏకంగా అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ఇళ్ళపైనను కూడా బాధితులు ముట్టడించి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారంటే వారి ఆగ్రహం ఏ రేంజిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.


బాబే చెప్పేశారుగా :


శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులుగా జరుగుతున్న తుపాను పునరావాస, సహాయ చర్యలపై ప్రజలు సంతృప్తికరంగా లేరని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అన్నారు.  తుపాను సహాయక చర్యలపై  అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం అధికారులు బాగా కష్టపడాలని సూచించారు.  సహాయక చర్యలపై ప్రతి ఒక్కరిలో సంతృప్తి రావాలన్నారు. నీటికి, భోజన ఏర్పాట్లకు, రాకపోకల పునరుద్ధరణకు సంబంధించిన సహాయ చర్యలపై సీఎం అసంత్రుప్తి వ్యక్తం చేయడం విశేషం.

 విద్యుత్ పునరుద్ధరణ పనులపైనా బాగా అసంత్రుప్తి ఉందన్నారు. తుపాను సహాయక చర్యల్లో కీలకమైన మంచినీటి సరఫరా, భోజన ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, పారిశుద్ధ్య చర్యలు కీలకమని, వీటిలో లోపాలు ఉండకూడదన్నారు. ప్రతి గ్రామాన్ని అధికారులు స్వయంగా సందర్శించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఇదిలా ఉండగా చంద్రబాబు సహాయ చర్యలపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడాన్ని తప్పు పట్టారు. సీఎం కావాలనే రచ్చకు తెర తీశారన్న కామెంట్స్ వినిపించాయి.


అంచనాలు పెంచేశారా :


ఇక తిత్లీ తుపానుకు సంబంధించి చంద్రబాబు నష్టం అంచనాలు పెంచేసారట. ఈ మాట అన్నది ఎవరో కాదు బీజేపీ నాయకుడు విష్ణు కుమార్ రాజు. ఏకంగా 2,800 కోట్ల నష్టం అంటూ బాబు చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. తక్షణ సాయంగా 1200 కోట్ల రూపాయలు కోరడంపైన విమర్శలు చేశారు. అంచనాలు పెంచడం, ఆనక నిధులు ఇవ్వలేదని కేంద్రన్ని నిందించడం బాబుకు అలవాటేనని కూడా హాట్ కామెంట్స్ చేశారు. మొత్తం మీద చూసుకుంటే తుపను సాయం కూడా రాజకీయం రంగు పులులుకుంటోందని అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: